BPL: సింగరేణి యాజమాన్యం ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 6వ ఇంక్లైన్ గనికి వెళ్లే దారిలో ఉన్న విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలను కొడుతున్నారు. కొట్టడం మంచిదే కాని కొట్టిన కొమ్మలు తీయకపోవడంతో ఎక్కడి కొమ్మలు అక్కడే ఉండి ప్రజలకు ఇబ్బందిగా మారాయి. అధికారులు స్పందించి పారిశుధ్య కార్మికులచే కొట్టిన కొమ్మలు తీసేసేల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.