సూర్యాపేట పట్టణ22వ వార్డులో ఎలాంటి మార్కింగులు చేయవద్దని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖ అధికారికి మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ శుక్రవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు మార్కింగ్ చేయడం వలన తాము కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తారని ఆందోళనతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.