TSPSC : సీపీడీవో పరీక్ష రద్దు చేయాలని మహిళల ఆందోళన
తెలంగాణ (Telangana) లోపేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లిక్ కమీషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో (CPDO) అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ (Telangana) లోపేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లిక్ కమీషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో (CPDO) అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రొఫెసర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ (Kodandaram) స్పందించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్ లీక్‌లో ఒక్కరే ఉన్నారని అనుకోవడం లేదు.
ప్రశ్నప్రత్రం లీక్ (Paper leak) పై రకరకాల వదంతులు వచ్చాయి. పరీక్షల రద్దుతో నిరుద్యోగులు (unemployed) ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మళ్లీ క్వాలిఫై అవుతామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాలలో సీఎం కేసీఆర్ (CM KCR ) ప్రభుత్వం ఆడుకుంటోంది. లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణను లీకుల రాజ్యం, లిక్కర్ రాజ్యంగా మార్చారు. టీఎస్పీస్సీలో సమగ్ర పక్షాళన జరగాలి. డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాము. రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి త్వరలో పోరాటానికి పిలుపునిస్తామన్నారు. ఇక, పేపర్ లీక్‌పై బీజేపీ, (BJP)కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. CDPO, EO ఎగ్జామ్‌ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ కన్నా ముందు జరిగిన గ్రూప్-1 పరీక్షా పత్రం లీక్ అయ్యిందని తేలగా.. అదేవిధంగా తాము రాసిన పరీక్షలో కూడా అవకతవకలు జరిగి ఉంటాయని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.