SSMB 28 Mahesh new look : ఏంది సామి ఆ అందం.. SSMB 28 మహేష్ లుక్ వైరల్!
అరె.. అసలు మహేష్ బాబు అందం తింటున్నాడా.. అన్నం తింటున్నాడా.. అనేది ఎవరికి అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. ఎప్పుడు చూసిన ఒకేలా కనిపిస్తాడు మహేష్. టీనేజ్ కుర్రాళ్లు కూడా మహేష్ ముందు పనికిరారు. మహేష్ గ్లామర్ సీక్రెట్ ఏంటని అడిగితే.. తక్కువ తింటాను, తక్కువ మాట్లాడతాను.. అని చెబుతుంటాడు. ఎంతమంది అలఆ ట్రై చేసిన మహేష్‌లా మెయింటేన్ చేయడం కష్టం.
అరె.. అసలు మహేష్ బాబు అందం తింటున్నాడా.. అన్నం తింటున్నాడా.. అనేది ఎవరికి అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. ఎప్పుడు చూసిన ఒకేలా కనిపిస్తాడు మహేష్. టీనేజ్ కుర్రాళ్లు కూడా మహేష్ ముందు పనికిరారు. మహేష్ గ్లామర్ సీక్రెట్ ఏంటని అడిగితే.. తక్కువ తింటాను, తక్కువ మాట్లాడతాను.. అని చెబుతుంటాడు. ఎంతమంది అలఆ ట్రై చేసిన మహేష్‌లా మెయింటేన్ చేయడం కష్టం. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాత్రం.. రోజు రోజుకి అందం పెరుగుతునే ఉంది. తాజాగా బయటకొచ్చిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి మహేష్ బాబు ఫోటోస్ బయటకొచ్చాయి. ఈ ఫోటోల్లో మహేష్ బాబు, త్రివిక్రమ్‌తో పాటు యాక్టర్ జయరామ్ కూడా ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను, ఈరోజు ఆయన కొడుకుతో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.. అంటూ జయరామ్, మహేష్ బాబుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా నటించాడు జయరామ్. అప్పటి నుంచి తెలుగులో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అల వైకుంఠపురములో సినిమా సెంటిమెంట్‌లో భాగంగా.. SSMB 28లోను ఈయనను కీలక పాత్ర కోసం తీసుకున్నాడు మాటల మాంత్రికుడు. అందుకే సెట్స్‌లో జాయిన్ ఫస్ట్ డేనే మహేష్‌తో ఫోటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే.. ఈ సినిమాను ఆగష్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉగాది కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.