»Uttam Kumar Reddy Says Agree Who Has Been Announced As Cm
CMగా ఎవరినీ ప్రకటించిన ఓకే అంటోన్న ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించినా సరే తనకు అభ్యంతరం లేదని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఢిల్లీలో డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
Uttam Kumar Reddy: తెలంగాణ సీఎం ఎంపిక ప్రక్రియ సస్పెన్ష్ ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఢిల్లీ వెళ్లడం.. డీకేను కలువడంతో హైప్ నెలకొంది. ఇంతలో ఉత్తమ్ (uttam) మీడియాతో మాట్లాడారు.
ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానని ఉత్తమ్ (uttam) తెలిపారు. సీఎల్పీ నేతను హైకమాండ్ ఎన్నుకుంటుందని స్పష్టంచేశారు. తనకు సంబంధించి ఎవరినీ సీఎల్పీ నేతగా ప్రకటించినా అంగీకారమేనని వెల్లడించారు. డీకేతో భేటీ తర్వాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌తోపాటు భట్టి కూడా హస్తినలోనే ఉన్నారు.
Uttam Kumar Reddy said that he has to resign as an MP to swear in an MLA. So will follow the process.
సీఎల్పీ నేతను ఏఐసీసీ చీఫ్ ఖర్గే (kharge) ప్రకటిస్తారని ఉత్తమ్ (uttam) వెల్లడించారు. హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి ఉత్తమ్ (uttam) ఎమ్మెల్యేగా (mla) విజయం సాధించారు. ఓకేసారి రెండు పదవులు చేపట్టొద్దు.. అందుకే ఓ పదవీకి రాజీనామా చేయాల్సి ఉంది. అలాగే మరో 4, 5 నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. సో.. ఆ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.