»Unknown Persons Entered Actress Dimple Hayathi House
Heroine డింపుల్ హయతి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు
ఈ సంఘటనతో భయపడిన డింపుల్ హయాతి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమె నివసిస్తున్న ఇంట్లోకి గుర్తు తెలియని వారు అకస్మాత్తుగా ప్రవేశించారు. కుక్క (Dog) అరవడంతో వారు పరారయ్యారు. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ట్రాఫిక్ డీసీపీతో పోరాడుతున్న డింపుల్.. అకస్మాత్తుగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఉలిక్కిపడింది. రోజురోజుకు భయాందోళనతో జీవిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills )లో ఎస్కేఆర్ ఎన్ క్లేవ్ భవనంలో డింపుల్ హయాతి తన సహచరుడు విక్టర్ డేవిడ్ (Victor David)తో కలిసి నివసిస్తోంది. ఈ భవనంలోనే నివసించే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దేతో (Rahul Hegde) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం హీరోయిన్ డింపుల్ నివసించే సీ2 ఫ్లాట్ లోకి ఒక్కసారిగా ఓ యువతి, యువకుడు ప్రవేశించారు. పని మనిషి వారిద్దరిని ఎవరు? అని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదు. ఈ సమయంలో ఇంట్లోని పెంపుడు కుక్క (Pet Dog) అరవడంతో వారిద్దరూ భయపడ్డారు. భయంతో వారిద్దరూ లిఫ్టులోకి (Lift) వెళ్లారు. అయితే లిఫ్టు లో వారితోపాటు కుక్క కూడా ఉంది.
ఈ సంఘటనతో భయపడిన డింపుల్ హయాతి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Police) యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేయగా.. వారిద్దరూ ఏపీలోని రాజమండ్రికి చెందిన కొప్పిశెట్టి సాయిబాబు, శ్రుతిగా గుర్తించారు. హీరోయిన్ డింపుల్ హయాతి అభిమానులుగా (Fans) వాళ్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని హీరోయిన్ కు తెలపడంతో వారిని విడిచిపెట్టారని సమాచారం. ఈ సందర్భంగా వారిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ (Counselling) ఇచ్చారు. ఈ సంఘటనలో ఎలాంటి కేసు నమోదు కాలేదు.