ELR: చింతలపూడి నియోజకవర్గంలోని రోడ్లు మొత్తం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. శుక్రవారం చింతలపూడి-టి.నరసాపురం రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. 4 కి.మీ. రోడ్డు మరమ్మతుల కోసం రూ.1.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మరమ్మతులు పూర్తిస్థాయిలో చేసి, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.