Tspsc is the xerox centre:పేపర్ లీకేజీతో టీఎస్ పీఎస్సీపై (Tspsc) రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని నెటిజన్లు (netizens) మండిపడుతున్నారు. కమిషన్ కార్యాలయం ముందు వెలిసిన ఓ పోస్టర్ (poster) మాత్రం కలకలం రేపుతోంది. అందులో టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ (xerox) అని రాసి ఉంది. ఇక్కడ అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లభిస్తాయని క్యాప్షన్ కూడా పెట్టారు.
Tspsc is the xerox centre:పేపర్ లీకేజీతో టీఎస్ పీఎస్సీపై (Tspsc) రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని నెటిజన్లు (netizens) మండిపడుతున్నారు. కమిషన్ కార్యాలయం ముందు వెలిసిన ఓ పోస్టర్ (poster) మాత్రం కలకలం రేపుతోంది. అందులో టీఎస్ పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ (xerox) అని రాసి ఉంది. ఇక్కడ అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లభిస్తాయని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ పోస్టర్ ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు (arjun babu) పేరుతో ఉంది.
పేపర్ లీకేజీ ఇష్యూకి సంబంధించి.. పరీక్ష రద్దు చేయడం కాదని.. బోర్డును రద్దు (board) చేయాలని అందులో కోరారు. బోర్డు తప్పు చేస్తే.. అభ్యర్థులకు శిక్ష వేస్తారా అని అడిగారు. ఈ ఇష్యూపై సీఎం కేసీఆర్ (cm kcr) వెంటనే నిరుద్యోగులకు సారీ (sorry) చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. అలా చేస్తేనే సీఎం కుటుంబ సభ్యుల పాత్ర లీకేజీలో లేదని భావిస్తాం అని అందులో రాశారు. బోర్డు, సంబంధిత మంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు నెలకు రూ.10 వేల (10 thousand) చొప్పున పరీక్ష నిర్వహించే వరకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో (TSPSC paper leak) ప్రధాన నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో (Praveen pen drive) మొత్తం 5 పేపర్లను గుర్తించారు. వాటిలో ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ ఎగ్జామ్ పేపర్ల పరీక్ష జరగలేదు. ఫిబ్రవరి 27వ తేదీన ప్రవీణ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు ఇప్పటికే కూపీ లాగారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.