Revanth Reddy Interesting Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరికి వచ్చిందని సమాచారం. ఓకేసారి 113 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెబుతున్నారు.
ఆరు వారాలు, ఆరు హామీలు.. ఆరు నూరైనా ఓడేది కారు.. ఇక హస్తం గెలుపు ఖరారు అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. దాంతో తమ పార్టీ అధికారంలోకి వస్తోందని భావిస్తోంది. కర్ణాటక మాదిరిగా ఇచ్చిన హామీలతో అధికారం చేజిక్కించుకుంటామనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీపై కాస్త వ్యతిరేకత ఉంది. వరసగా రెండుసార్లు అధికారం చేపట్టడం, ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రూప్-1 పరీక్ష వాయిదా.. ఇతర పరీక్షలు వాయిదా పడటం నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉంది. దానిని కాంగ్రెస్, బీజేపీ క్యాష్ చేసుకోవడం లేదు. అభ్యర్థుల ఎంపికపై సమయం మొత్తం కేటాయిస్తున్నారు.
మరోవైపు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ల కోసం కోట్ల రూపాయలు వసూల్ చేశాడని.. భూమి కూడా తన పేరు మీద రాయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తొలుత కొత్త మనోహర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఓ నలుగురి పేర్లను, ఇచ్చిన నగదు గురించి తెలియజేశాడు. తర్వాత సోషల్ మీడియాలో మరో నేత పేరు కూడా వినిపించింది. టికెట్ల కేటాయింపు అంశం కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది.