»Telangana Resident Dies In Iraq Minister Ktr Initiative To Bring Dead Body
ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి..మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ
ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
ఇరాక్(Iraq)లో తెలంగాణ(Telangana) వాసి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తిది సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం, గోపాలరావుపల్లె అని గుర్తించారు. ఆ వ్యక్తి పేరు పర్శ రాములు(Parsha Raamulu). ఇరాక్ లో గుండెపోటు(HeartAttack)తో పర్శ రాములు మృతి చెందినట్లు కుటుంబీకులు సమాచారం అందించారు.
ఇరాక్(Iraq) నుంచి పర్శ రాములు మృతదేహాన్ని(Deadbody) ఇండియా(India)కు రప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి మంత్రి కేటీఆర్(KTR) లేఖ రాశారు. మృతదేహాన్ని ఇండియాకు చేర్చే ఏర్పాట్లు చేస్తామని పర్శ రాములు కుటుంబీకులకు హామీ ఇచ్చారు.