ఈమధ్య సోషల్ మీడియా(Social Media) వాడకం ఎక్కువైంది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను, వీడియో(Videos)లను సోషల్ మీడియాలో చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నెట్టింట తాము పోస్టు చేసే వీడియోలకు లైక్స్, షేర్స్, వ్యూస్(Views) రావడం కోసం సాహసాలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రాణాలను పోగోట్టుకుంటున్నారు. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి ఇన్ స్టా రీల్స్(Insta Reels) చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
శ్రీరామ్‌నగర్ రహ్మత్‌నగర్‌కు చెందిన మదర్సా విద్యార్థి సర్ఫరాజ్ (16) ఉండేవాడు. తనతో పాటు మరో ఇద్దరు యువకులతో కలిసి సనత్‌నగర్ రైల్వేట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ (Insta Reels) చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో సర్ఫరాజ్ ను రైలు ఢీకొంది. ఈ ఘటనలో సర్ఫరాజ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా పోలీసులకు సమాచారం అందింది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఇన్ స్టా రీల్స్(Insta Reels) చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి(Case File) దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.