శాసనసభ, శాసన మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.శాసనసభ, శాసన మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన ఈ నెల 8న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 9,10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. 12వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. ఈ నెల 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బడ్జెట్ పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇవ్వగా.. సమావేశాలు తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ నెల 12న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా, శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.