»Sivabalakrishna Important Data Stored In Electronic Gadgets
Sivabalakrishna: ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో భద్రపరిచిన కీలక డేటా!
: అడ్డదారిలో సొమ్ము సంపాదించిన కేసులో శివబాలకృష్ణ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే అతని సెల్ఫోన్లు 10, ల్యాప్‌టాప్‌లు 9, పెన్‌డ్రైవ్‌లు 10, మెమొరీకార్డులు 3, ఒక ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లలో డేటా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Sivabalakrishna: అడ్డదారిలో సొమ్ము సంపాదించిన కేసులో శివబాలకృష్ణ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే అతని సెల్ఫోన్లు 10, ల్యాప్‌టాప్‌లు 9, పెన్‌డ్రైవ్‌లు 10, మెమొరీకార్డులు 3, ఒక ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్ దొరికాయి. ఇవి ఎనిమిదేళ్లలో హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ వినియోగించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో భారీగా డేటా ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఒకవేళ అధికారులకు దొరికిన తప్పించుకునే పన్నాగంలో భాగంగానే అక్రమాస్తుల చిట్టాను వీటిలో దాచుకున్నట్లు తెలుసుకున్నారు. 2012 నుంచి శివబాలకృష్ణ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న అనిశా అధికారులు అప్పటి ఫోన్ల గురించి చెక్ చేశారు. కానీ అవి దొరకలేదు. పెద్ద లావాదేవీ పూర్తయినప్పుడల్లా సెల్‌ఫోన్ మార్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సహాయంతో అందులో డేటాను వెలికితీసే పనిలో ఉన్నారు.
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తన నుంచి వాటాలు పొందినట్లు శివబాలకృష్ణ అనిశా విచారణలో అంగీకరించినట్లు సమాచారం. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆయన వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సప్ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు సమాచారం. భూములు కొని రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం అనిశా ముందుంది. అలాగే ఐఏఎస్ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెల్ఫోన్ల డేటాను వడపోసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.