Hindu Temple : దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయం.. 14న ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అధికారిక పర్యటన చేస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Vice President Jagdeep Dhankhar Praised Prime Minister Modi
Hindu Temple : ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అధికారిక పర్యటన చేస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం 2015 నుండి ప్రధాని మోడీ యుఎఇకి ఇది ఏడవ పర్యటన.. గత ఎనిమిది నెలల్లో ఆయన మూడవ పర్యటన. ఈ పర్యటనలో ప్రధాని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడానికి, బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు.
యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను కూడా ప్రధాని కలుస్తారు. తన ఆహ్వానంపై ప్రధాన మంత్రి దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024కి గౌరవ అతిథిగా హాజరవుతారు. సమ్మిట్‌లో మోడీ ప్రత్యేక కీలకోపన్యాసం చేస్తారు. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయమైన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో జరిగే కార్యక్రమంలో ఆయన యుఎఇలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ UAEలో జరిపిన చారిత్రాత్మక పర్యటన తర్వాత, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగాయి.
సరిహద్దు లావాదేవీల కోసం భారతీయ రూపాయి, AED వినియోగాన్ని ప్రోత్సహించడానికి రెండు దేశాలు ఫిబ్రవరి 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) , జూలై 2023లో స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ (LCS) వ్యవస్థపై సంతకం చేశాయి. 2022-23లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా 85 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుతుందని అంచనా వేయడంతో రెండు దేశాలు ఒకదానికొకటి అగ్ర వాణిజ్య భాగస్వాములలో ఉన్నాయి. 2022-23లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా భారతదేశంలోని టాప్ 4 పెట్టుబడిదారులలో UAE కూడా ఉంది.
జితేంద్ర వైద్య (ఇండియన్ పీపుల్స్ ఫోరమ్) మాట్లాడుతూ, ‘యుఎఇలోని 35 లక్షల మంది భారతీయులకు నేను ఇండియన్ పీపుల్స్ ఫోరమ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. బీఏపీఎస్ ప్రపంచవ్యాప్తంగా 1200 దేవాలయాలను కలిగి ఉంది. ఈ ఆలయ కథ ఒక చారిత్రక పురాణం వంటిది. ఈ ఆలయం చరిత్ర సృష్టిస్తోంది. యూఏఈలో సంప్రదాయ హిందూ దేవాలయం ఉండడం ఒక అద్భుతం. యావత్ ప్రపంచానికి సామరస్య సందేశాన్ని అందించే ఆలయం అద్భుతం. మనం తరాల గురించి మాట్లాడేటప్పుడు.. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక ఇటుక అందించారని నేను భావిస్తున్నాను. అందుకని నా పిల్లలకి ఇది నా గుడి అని చెప్తాను, మా నాన్న ఇక్కడ ఇటుక పెట్టాడని మా పిల్లలు చెప్తారు. బంజరు భూమి నుండి కట్టిన ఈ ప్రదేశాన్ని మా తాత చూశారని వాళ్ళ పిల్లలు చెబుతారు! అందువల్ల ఈ ఆలయం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అన్నారు.