KTR ON Singareni:తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. సింగరేణి (Singareni) అంటే ఒక కంపెనీ కాదని, తెలంగాణ భాగ్యరేఖ అని చెప్పారు. సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బెల్లంపల్లిలో (BELLAMPALLY) నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించారు. 350 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
దేశంలో 75 ఏళ్లలో ఏ ప్రధాని (PM), ఏ సీఎం (CM) ఆలోచించని విధంగా ఒక పెద్ద దిక్కుగా రైతులను సీఎం కేసీఆర్ (CM KCR) ఆదుకుంటున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో దళితబంధు కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. బెల్లంపల్లిలో మంచినీటి సమస్య తీర్చామని మంత్రి కేటీఆర్ (KTR) గుర్తుచేశారు.
కేసీఆర్ను (KCR) ముచ్చటగా మూడోసారి సీఎంను చేద్దామని మంత్రి కేటీఆర్ (KTR) కోరారు. తమ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురయ్యామని.. పనులు జరగలేవని గుర్తుచేశారు. మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
పనిలో పనిగా ప్రియాంక గాంధీపై (PRIYANKA GANDHI) విమర్శలు చేశారు. అసలు కుటుంబ పాలన వారిదన్నారు. తాత, ముత్తాల నుంచి కుటుంబ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. టూరిస్టులు వచ్చి పోతుంటారని.. ప్రియాంక కూడా పర్యాటకురాలేనని చెప్పారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతమయం అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నా సంక్షేమ పథకాలు.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని సూటిగా అడిగారు.