రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని ,రాహుల్ గాంధీని చూసి బీజేపీ , మోడీ భయపడుతున్నారని ధ్వజమెత్తారు . రాహుల్ గాంధీపై వేటు భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా అభివర్ణించారు . దీనిపై న్యాయ పరంగా పోరాతామని స్పష్టం చేసారు . మరోవైపు రాహుల్ ఫై వేటు నిర్ణయాన్నినిరసిస్తూ దేశవ్యాప్తంగా పలువురు నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు .