»Revanth Reddy Government To Introduce Vote On Account Budget
Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొదటి సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముందు ఉండడంతో పూర్తిబడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.
Revanth Reddy government to introduce Vote on Account Budget
Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు అయిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. లోక్ సభ ఎన్నికలలు ఉండడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుండంతో అందిరిలో ఆసక్తి నెలకొంది. గత ఏడాది అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
చదవండి:Nagoba Jatara 2024: అత్యంత వైభవంగా నాగోబా జాతర ప్రారంభం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. బడ్జెట్‌పై సోమవారం నాడు శాసనసభ, శాసనమండలిలో వేర్వేరుగా చర్చ జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ రూ. 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఉండక పోవచ్చని తెలుస్తుంది. ఎన్నికల తర్వాత జూన్ లేదా జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.