రేషన్ డీలర్ల(Ration dealers)తో ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. 2.83 కోట్ల రేషన్ కార్డుదారుల (Ration card holders) ప్రయోజనం ప్రభుత్వన్నికి ముఖ్యమని, పేదలు ఆకలితొ ఉండకుండా సహకరించాలని మంత్రి గంగుల (Minister Gangula) కోరారు. డిమాండ్ల సాధనకోసం సమ్మే చేస్తున్న రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ సచివాలయం(Secretariat)లో మంగళవారం బేటీ అయ్యారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమ్మే విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నామని రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు, ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి, 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని మంత్రి సూచించారు.