Rain Alert To Various Districts In Telangana From 20th May
Weather:తెలుగు రాష్ట్రాల్లో హై టెంపరేచర్ నమోదవుతుంది. ఉదయం 7 గంటలకే ప్రచండ భానుడు విజృంభిస్తున్నాడు. దీంతో జనాలు వామ్మో.. ఏం ఎండలు అంటున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
మే 20వ తేదీ నుంచి వర్షాలు (rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో జనాలు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్దీ రోజులు అయినా వాతావరణం చల్లబడుతుందని అనుకున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లో కూడా తుఫాన్, అల్పపీడనం, వాయుగుండం ఏర్పడటంతో వర్షాలు కురిశాయి. దాంతో ఒక్కసారిగా టెంపరేచర్ పెరగడంతో జనాలు తట్టుకోలేకపోయారు.
పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని జిల్లాలకు భారీ వర్ష (rains) సూచన జారీచేసింది. సో.. ఎలాగైనా వాతావరణం చల్లబడుతుందని అనుకుంటున్నారు.
జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయట. జూన్ 15వ తేదీన ఏపీకి వస్తాయట. వారం రోజుల అటు ఇటుగా వర్షాలు కురుస్తాయి. సో.. కొద్దీ రోజులు చల్లగా ఉన్నా.. మళ్లీ సీజన్ ప్రారంభం అవుతుందని జనం అనుకుంటున్నారు.