తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress party) తన వ్యూహాలకు పదును పెట్టింది. గతంతో పోల్చితే పార్టీలో జోష్పెరగడమే పెంచడమే కాకుండా, బీఆర్ఎస్ (BRS) ను ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్లో పార్టీ బలంగా ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాస్త వీక్‌గా ఉందనేది ఆ పార్టీ అభిపాయం. దీంతోనే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లో బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. పైగా జాతీయ స్థాయి లీడర్లతో బస్సు యాత్ర (Bus yatra) చేయడంవల్ల ఎక్కువ మందిని ప్రభావం చేయొచ్చనేది పార్టీ భావన.
అందుకే రాహుల్, ప్రియాంక(Priyanka)లను చీఫ్గెస్టులుగా రాష్ట్ర రావాలని పార్టీ రిక్వెస్టు చేసింది. ములుగు జిల్లాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్వహించనున్నారు. వెంకటాపురం మండలం రామంజపురంలో మహిళా డిక్లరేషన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 50 వేలకు పైగా మహిళలు హాజరుకానున్నారు. రాహుల్, ప్రియాంక సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Sitakka) ఏర్పాట్లు చేస్తున్నారు.