SSC Paper Leak : కరీంనగర్ జైలు నుండి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ నిందితుడు విడుదల
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ నేడు కరీంనగర్ జైలు నుండి విడుదలైయ్యారు. తర్వాత మీడియా(Media)తో మాట్లాడారు. తనపై పోలీసులు(Police) ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేశారని ప్రశాంత్(Prashanth) ఆరోపించారు.
SSC Paper Leak : టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ(SSC Paper Leak) వ్యవహారం రాష్ట్రంలో ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఈ విషయం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అనంతరం బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ నేడు కరీంనగర్ జైలు నుండి విడుదలైయ్యారు. తర్వాత మీడియా(Media)తో మాట్లాడారు. తనపై పోలీసులు(Police) ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేశారని ప్రశాంత్(Prashanth) ఆరోపించారు. ఈ నెల 4న ఉదయం 10:05 గంటలకు వాట్సాప్(Whatsaap) ద్వారా టెన్త్ క్లాస్ పేపర్ తనకు వచ్చిందన్నారు. తాను ఉదయం 10:46 గంటలకు తన ఫోన్ కు వచ్చిన క్వశ్చన్ పేపర్ ను చూసినట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత తనకు తెలిసిన జర్నలిస్టు మిత్రులకు షేర్ చేశానన్నారు. తాను బండి సంజయ్(Bandi Sanjay) తో పదే పదే ఫోన్ లో మాట్లాడినట్టుగా పోలీసులు చేసిన ఆరోపణలను ప్రశాంత్ తోసిపుచ్చారు. బండిసంజయ్ పీఏ అందుబాటులో లేకపోవడంతో ప్రెస్ నోట్ రాయాలని తనను కోరారన్నారు. బండి సంజయ్ తో కేవలం ఫోన్ లో 40 సెకన్లు మాట్లాడినట్టుగా ప్రశాంత్ తెలిపారు.
ఈ నెల 4 సాయంత్రం ఆరు గంటలప్పుడు పోలీసులు తనను ప్రశ్నించారని ప్రశాంత్ చెప్పాడు. తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి పోలీసులకు ఇచ్చినట్టుగా ప్రశాంత్ వివరించారు. తాను పోలీసుల వద్ద ఉన్న సమయంలో చాలా ఫోన్లు వచ్చినట్టుగా ఆయన గుర్తు చేసుకున్నారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి తనకు కరీంనగర్, వరంగల్, హైద్రాబాద్ జర్నలిస్టుల నుండి ఫోన్లు వచ్చినట్టుగా ప్రశాంత్ చెప్పారు. రెండు గంటల్లో 144 ఫోన్లు మాట్లాడినట్టుగా పోలీసులు చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు. విద్యార్థుల జీవితాలతో తాను ఆడుకుంటున్నట్టుగా చేసిన ఆరోపణలను ప్రశాంత్ ఖండించారు.