సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సును ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేశారు. బస్సులో అణువణువూ తనిఖీ చేయగా వారికి సీఎం కేసీఆర్, ఆయన సిబ్బంది సహకరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈసీ గట్టి చర్యలు తీసుకుంది. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తోంది.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల పోలింగ్‌కు (Election Polling) మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కూడా ప్రచారంలో జోరు పెంచింది. అందరూ నేతలు బిజీగా ఉంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన 60 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారాన్ని పూర్తి చేశారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథాన్ని తనిఖీ చేస్తోన్న వీడియో:
#WATCH | Election squad checks the bus of Telangana CM KCR in Karimnagar near Gundlapalli toll gate.
తాజాగా సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న ప్రచార రథాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election commission) అధికారులు, పోలీసులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ (Election code) అమలులో ఉండటంతో సీఎం కేసీఆర్ ప్రచార బస్సులో అధికారులు అణువణువు తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ (Karimnagar)లోని గుండ్లపల్లి టోల్ గేట్ వద్ద కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఈ తరుణంలో అధికారులకు సీఎం కేసీఆర్, ఆయన సిబ్బంది సహకరించారు.
ఈ మధ్యనే సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ధర్మపురిలో ప్రచారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెళ్తుండగా చల్గల్ చెక్‌పోస్టు వద్ద కారును ఆపి అధికారులు తనిఖీలు చేశారు. ప్రస్తుతం మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలన్నీ ప్రజల మధ్య సభలను నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టో పథకాలను గుర్తుచేస్తూ, వాటిని వివరిస్తూ ఓటర్లను ఊరిస్తున్నాయి.