»Patel Ramesh Reddy Followers Attack On Aicc Leader Mallu Ravi
Mallu Ravi: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పై దాడి
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ గొడవ ముగిసింది. సూర్యాపేటలో కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Mallu Ravi: సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ గొడవ ముగిసింది. సూర్యాపేటలో కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో.. పటేల్ రమేష్ రెడ్డి రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ చిన్న పార్టీ తరపున నామినేషన్ కూడా వేశారు. కాంగ్రెస్‌పై తిరుగుబాటుకు ఆయన రెడీ అయ్యారు. సీటు ఇవ్వకుంటే రెబల్‌గా పోటీ చేస్తానని.. దామోదర్ రెడ్డిని కచ్చితంగా ఓడిస్తాన్నన్నారు. ఆయన హెచ్చరికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం దిగివచ్చింది. ఆయను తాజాగా బుజ్జగింపులతో చల్లబరిచారు.
ఏఐసీసీ నేత మల్లు రవి ప్రతినిధి బృందంతో దిగారు. దామోదర్‌రెడ్డికి హైకమాండ్ ఎంపీ టికెట్ ఆఫర్ చేయడంతో సహకరిస్తానని చెప్పారు. ఈ క్రమంలో మల్లు రవి సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. దాంతో పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా, తమ నేతకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటూ మల్లు రవిపై పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. పటేల్ రమేష్ రెడ్డి వారిని వారించడంతో గొడవ ముగిసింది.