Student Murder: క్రైమ్ రేట్ పెరుగుతోంది. అప్సర అనే మహిళను పూజారి హత్య చేయడం.. ఆ వెంటనే మరో విద్యార్థిని దారుణ హత్యకు (Student Murder) గురయ్యింది. ఆమె మృతికి గల కారణాలు తెలియలేదు. దారుణంగా హతమార్చారు. ఈ ఘటన వికారాబాద్ (vikarabad) జిల్లా పరిగి మండలం కాళ్లపూర్ గ్రామంలో జరిగింది.
శిరీష (sirisha) అనే పారా మెడికల్ విద్యార్థిని శనివారం రాత్రి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. ఈ రోజు ఉదయం గ్రామ సమీపంలో నీటి కుంటలో ఓ మృతదేహం కనిపించింది. ఆ డెడ్ బాడీ శిరీషదే.. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన శిరీష.. వికారాబాద్‌లో గల ఓ ప్రైవేట్ కాలేజీలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. ఇంతలో ఆమె విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది
దుండగులు శిరీషను (sirisha) అత్యంత దారుణంగా హత్య చేశారు. యువతి కాళ్లు, చేతుల నరాల కోసి, కళ్లు రెండు తీసివేసినట్టు ఉంది. కళ్లలో స్కూ డ్రైవర్‌తో పొడిచినట్టు భావిస్తున్నారు. ఆమెను ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది..? ఎవరు ఆమెను హత్య చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.