మేడ్చల్: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకింపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్‌లో 7వ తరగతి విద్యార్థి శ్రీనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం హాస్టల్ గదిలో విద్యార్థి ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అతన్ని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జీవన జ్యోతిర్లింగ శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. ఆలయం ముందు ద్వాజస్తంభం ప్రతిష్ట కూడా శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.
MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన రైతు 3 ఎకరాల భూమిని కౌలు తీసుకోని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. పంట సాగులో వచ్చే దిగుబడి కూలీలకు, ఎరువుల ఖర్చులకు సరిపోతుందని రైతు HIT TV కి తెలిపారు. కోతులు పంటను నాశనం చేస్తున్నాయని, ఈ పంటకు సరైన నీటి సౌకర్యం లేదని వాపోయారు. పంట మంచిగా పండితే ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుందని తెలిపారు.
వనపర్తి నాగవరం తండాలోని గురుకుల కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన ప్రవేశ పరీక్షలు ముగిశాయి. మొత్తం 669 మంది విద్యార్థులకు గాను 654 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరైనట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ అర్చన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
RR: నందిగామ(మం) మామిడిపల్లిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు. స్వామి కరుణ ఎల్లప్పుడూ తమపై ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
KMM: మధిర మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్,వైస్ ఛైర్పర్సన్,కౌన్సిలర్ల సన్మాన సభ ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 21 వ వార్డు కౌన్సిలర్ రంగా రూప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కౌన్సిలర్ బాధితులు అప్పగించిన ప్రజలకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆలయం వద్ద సరైన రోడ్లు, త్రాగునీరు, వసతి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.
NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామం లో ఆదివారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
RR: తుర్కయంజాల్‌లో ఆదివారం జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తుర్కయంజాల్, ఆదిభట్ల సర్కిల్ మహిళా నాయకురాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకురాళ్లు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కేవలం విద్య మాత్రమే సరిపోదని ఆర్థిక స్వయం ప్రతిపత్తికూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. మార్చి 1న మహిళా సమాఖ్య నిర్మాణ మహాసభను విజయవంతం చేయాలన్నారు.
WGL: పర్వతగిరి మండలం బూరుగుమళ్ళ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాము.
BHPL: కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని TRP భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం BHPL జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులం పేరుతో దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై హింసాత్మక దాడి చేయడం అమానుషమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MBNR: నంచర్ల గురుకుల పాఠశాలలో టీజీ సెట్-2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. 5 నుంచి 9వ తరగతుల ప్రవేశాల కోసం 513 మంది నమోదు చేసుకోగా, 488 మంది విద్యార్థులు హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. పోలీసు భద్రతతో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగాయని ప్రిన్సిపల్ రమ తెలిపారు.
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు కొండకింద తలనీలాలు సమర్పించి, దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ధర్మదర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూర్యాపేట: దాదాపు 14ఏండ్ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల పూర్వసమ్మేళానానికి సూర్యాపేట సిద్దార్థ హైస్కూల్ వేదికగా మారింది.