• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సంత్ సేవాలాల్ జయంతిలో ఎమ్మెల్యే

RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారా సంస్కృతిని రక్షించి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారన్నారు.

February 22, 2026 / 05:36 PM IST

ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష

KMM: ఉమ్మడి ఖమ్మంలో గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆరో తరగతి బ్యాక్లాగ్ పోస్టుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ కనకదుర్గ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 480 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 453 మంది పరీక్షకు హాజరైనట్లు మొత్తంగా 94.3 శాతం హాజరు నమోదైనట్లు ఆమె వివరించారు.

February 22, 2026 / 05:33 PM IST

సంగంబండ కాలువపై వంతెన కోరుతూ ఆందోళన

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ సంగంబండ కాలువపై వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో నీరు పారుతున్న సమయంలో పొలాలకు వెళ్లేందుకు కిలోమీటరు దూరం చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రవాణా, వ్యవసాయ పనులు అంతరాయం కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 22, 2026 / 05:32 PM IST

‘కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు’

WNP: రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు శివ హెచ్చరించారు. చీర్ల చందర్ ని అవమానించేలా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఆధారాలు లేకుండా బురదజల్లడం మానుకోవాలని, బీసీల ఐక్యతకు భంగం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు పలువురు నిరసన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 05:32 PM IST

రేపు కామారెడ్డి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజావాణి ప్రజలు సద్వినియోగం పట్టుకోవాలని కోరారు.

February 22, 2026 / 05:31 PM IST

నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేత

NLG: పెద్దవూర మండలం కోమటికుంట తండాలో ప్రభుత్వ భూమిలోని విలువైన చెట్లను అక్రమార్కులు యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టం నిబంధనలు తుంగలో తొక్కిన వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల ప్రమేయంతోనే చెట్లు నరుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

February 22, 2026 / 05:31 PM IST

గూడూరు: గుప్తనిధుల కోసం తవ్వకాలు.!

MHBD: గూడూరు మండలంలోని రాళ్లవాగు బ్రిడ్జి సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు అటువైపు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. JCB సహాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసి ఉన్న ప్రదేశం కనిపించడంతో వారు అవాక్కయ్యారు.

February 22, 2026 / 05:30 PM IST

వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి: MLA

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

February 22, 2026 / 05:30 PM IST

క్లీన్ సిటీ మనందరి బాధ్యత: ఛైర్‌పర్సన్

SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని 29వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్, సంత్ నిరంకారి మిషన్ వారు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇళ్లలోనే వేరుచేసి అందజేయాలన్నారు. 

February 22, 2026 / 05:30 PM IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు: మంత్రి

KMM: ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల నూతన చైర్మన్లు, కౌన్సిలర్లు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించిన మంత్రి, ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని మరియు పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు.

February 22, 2026 / 05:30 PM IST

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

BDK: కొత్తగూడెం మేదర బస్తీలో ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంచార జాతులుగా ఉన్న బంజారాలను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏకతాటిపైకి తెచ్చారని గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి భోగ్ భండారో పూజలు నిర్వహించి నివాళులర్పించారు.

February 22, 2026 / 05:28 PM IST

‘ఇందిరమ్మ ఇల్లు బిల్లులో సాంకేతిక లోపాలే కారణం’

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జాప్యం లేదని, సాంకేతిక లోపాలతోనే కొన్ని, ఆధార్ కార్డు వివరాలు సరి లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లులు నిలిచిపోయాయని ఆమె సృష్టం చేశారు.

February 22, 2026 / 05:28 PM IST

266 మందికి సీఎంఆర్‌ఎఫ్ సహాయం మంజూరు

PDPL: మంథని నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 1,00,09,000 విలువైన 266 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంథని 43, ముత్తారం 44, రామగిరి 44, కమాన్‌పూర్ 23, పాలకుర్తి 8 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 78 మందికి చెక్కులు అందనున్నాయని పేర్కొన్నారు.

February 22, 2026 / 05:28 PM IST

గోటి తలంబ్రాలు దీక్షలో పాల్గొనాలి : రామకోటి

SDPT: మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో గోటి తలంబ్రాల కార్యక్రమంపై ఆదివారం గజ్వేల్‌కి చెందిన రామకోటి రామరాజు సమావేశం నిర్వహించారు. శ్రీరామనవనాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అవసరమయ్యే గూటితో వచ్చిన తలంబ్రాలు వాడుతారని రామరాజు తెలిపారు. కోటి తలంబ్రాలు దీక్ష వచ్చే శనివారం భారీ ఎత్తున ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

February 22, 2026 / 05:27 PM IST

పోలీస్ స్టేషన్ కు చేరిన ఇంటర్ ప్రశ్నా పత్రాలు..!!

SRPT: ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు ఇంటర్ ప్రశ్న పత్రాలను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా నడుమన తీసుకువచ్చారు. జూనియర్ కళాశాలలకి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నాపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.

February 22, 2026 / 05:27 PM IST