హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla) ప్రాంతంలోని ఆరోరా ఫార్మా ప్రైవేటు కంపెనీ(arora pharmaceuticals pvt Company)లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ రిమాండ్ లో భాగంగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెండు కారణాల నేపథ్యంలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైఫ్..ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు తెలిసింది. ఓ యాక్సిడెంట్ రిపోర్టు సహా తనపై హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినందుకు సైఫ్ ఆమెపై కోపంతో ఉన్నాడని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.
హైదరాబాద్‌లో శ్యామ్ యాదవ్ (38) (shyam yadav) అనే వ్యక్తి ఈ రోజు గుండె పోటు (heart stroke) వచ్చింది. లాలాపేటకు (lalapeta) చెందన శ్యామ్ యాదవ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. అతను స్పోర్ట్స్ పర్సన్ (sports person).. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్మింటనే కాదు క్రికెట్ (cricket) ఆడేవాడట. అయితే నిన్న రాత్రి బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లి తిరిగి రాలేదు. అక్కడే హార్ట్ స్ట్రోక్ రావడంతో.. కుప్పకూలి...
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.
sharmila on ysr statue vandalize:అవుతాపూర్‌లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3800 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా విగ్రహాం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేశారు. ఇదీ బీఆర్ఎస్ గూండాలు చేసిన పని అని షర్మిల అన్నారు.
విద్యార్థుల అందరి ముందు కొట్టడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనతో కలత చెందిన సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన విద్యార్థులు అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తెలంగాణ వాదాన్ని బలంగా చాటారు. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకే అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ సంచలనం రేపారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెలంగాణను కొత్త రాష్ట్రంగా భారతదేశ మ్యాప్ లో తీసుకువచ్చిన కేసీఆర్ కు, నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణను కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకువచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలుపుతున్న కేటీఆర్ కు ధన్యవాదాలు.
భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పాలక మండలి సిద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నది. ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా
స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.