• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అమెజాన్ కార్గో విమానం ‘ప్రైమ్ ఎయిర్’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ శంషాబాద్ లో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.అమెజాన్ ఎయిర్ ను ప్రారంభించడం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో గొప్ప లక్ష్యమని ఆయన అన్నారు. భవిష్యత్తులో అమెజాన్ చేపట్టబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అమెజాన్‌ బృందాన్ని అభినందించారు. అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌...

January 23, 2023 / 05:49 PM IST

సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్‌లో నిలిచిపోయిన మెట్రో రైలు

హైదరాబాద్‌లో మెట్రో రైలు మరోసారి సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఎల్బీనగర్- మియాపూర్ కారిడార్‌లోని ఎర్రమంజిల్ లో మొరాయించింది. దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలులో తరిలించారు.ప్రధాన రవాణ సాధనల్లో ఒకటైన మెట్రో తరుచుగా ఆటంకాలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందికి గురివుతున్నారు. సాంకేతిక సమస్యలతో రైళ్లు గమ్యస్థానాలకు చేరకముందే నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా ఇతర రైళ్ల సర్వీసులూ ఆగిపోతున్నాయి. ట్...

January 23, 2023 / 07:01 PM IST

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

January 23, 2023 / 04:41 PM IST

మీకోసం జైలుకైనా వెళ్తా.. నిరాహార దీక్ష చేస్తా: పొంగులేటి

ప్రత్యేక అజెండాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సరికొత్త రాజకీయం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గం సత్తా చాటేలా రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైత...

January 23, 2023 / 04:16 PM IST

సమాచారం ఇచ్చిన రారు.. అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహాం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. విద్యుత్ సమస్య గురించి స్థానికులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇష్యూను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా… వారు అందుబాటులో లేరు. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమస్యల గురించి తెలుసుకు...

January 23, 2023 / 03:49 PM IST

యాదాద్రీశా ఏమిటీ ఘోరం.. లవర్ మోజులో పిల్లల్ని వదిలేసిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో  తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చ...

January 23, 2023 / 04:14 PM IST

ప్రభుత్వ టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలి: బండి సంజయ్

టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్‌ చేసిన టీచర్లను విడుదల చేయాలని కోరారు. కేసీఆర్‌ సర్కార్‌ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉందన్నారు. పసిపిల్లలు ఏడుస్తున్నా మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్‌ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప భావోద్వేగాలు పట్టవా? మానవత్వం లేదా అని తీవ్ర...

January 23, 2023 / 12:52 PM IST

70 ఏళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు: అసదుద్దీన్

మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉన్న ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ముస్లింలను మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ముస్లింలు అంతా ఒక్కటే ఓ నేతను ఎన్నుకోవడం ఆ పార్టీలు/ నేతలకు నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులాలకే ఇంపార్టెన్స్ అని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్...

January 23, 2023 / 12:06 PM IST

కేసీఆర్ డేంజరెస్ పర్సన్.. సీనియర్ ఐఏఎస్‌కే రక్షణ లేదు: రేవంత్

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట...

January 23, 2023 / 01:19 PM IST

జనసేనాని జగిత్యాల పర్యటన రూట్ మ్యాప్ విడుదల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన రూమ్ మ్యాప్ విడుదలైంది. మంగళవారం పవన్ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టుకి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాబోవు ...

January 23, 2023 / 09:33 AM IST

జోగుళాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జనవరి 26వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణ ఏకైక శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రజాకార్ల సమయంలో జోగుళాంబ అమ్మవారి మూలవిరాట్ ను బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. 2005లో వసంత పంచమి రోజున కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయంలో ...

January 23, 2023 / 10:35 AM IST

పసుపుబోర్డుపై అరవింద్ కు మంత్రి సవాల్

గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకో...

January 23, 2023 / 02:00 PM IST

క్యూబాలో పేదోళ్లు ధనికుల్లా చనిపోతారు: అలైదా

క్యూబాలో ప్రజలు పేదోళ్లలాగా బతికి ధనికుల్లా చనిపోతారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. క్యూబా విప్లవయోధుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కు విచ్చేశారు. నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు ముఖ్య అతిథులుగా వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు దేశమన్నా...

January 22, 2023 / 09:02 PM IST

ప్రేమించడమే పాపం అయ్యింది..అమానుష ఘటన

ఖమ్మం జిల్లాలోని మండాలపాడులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని, వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు యువతి కుటుంబాన్ని వెలివేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ.20 వేల జరిమానా విధించారు. ...

January 22, 2023 / 05:26 PM IST

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్‌ భక్తులు మల్లన్న పేరి...

January 22, 2023 / 04:12 PM IST