నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆక్రమించుకున్న భూములు, సింగరేణి నిధుల దోపిడీ, అక్రమ కాంట్రాక్టుల మీద విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన పోవాలని ప్రజలను సూచించారు.
ఓ సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వేధింపుల అంశంపై కాలేజ్ ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని..అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారనే ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ ఖండించారు. పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబుతున్న వారి దిగజారుడుతనానికి ఇది అద్దం పడుతుందన్నారు.
Revanth reddy:అంబర్ పేటలో చిన్నారి ప్రదీప్‌ను వీధి కుక్కల దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఇదీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలి.. మంత్రి కేటీఆర్ (ktr) మాత్రం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడం ఏంటీ అని అడిగారు.
ys sharmila:యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్‌ను (pawan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. ఇటీవల BRS కార్యకర్తల దాడిలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి షర్మిల (ys sharmila) తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.
straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్‌లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తూ సర్కార్ దవాఖానాలు సత్తా చాటుతున్నాయి. అరుదైన గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital-OGH) మరో ఘనతను సాధించింది. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)కి విద...
చికోటీ ప్రవీణ్..(Chikoti Praveen) అలియాస్ క్యాసినో ప్రవీణ్.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కేసినోలు( Casino) నిర్వహించడం, వాటికి ప్రముఖులను ఆహ్వానించడం చేశాడు. క్యాసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు, మనీ లాండరింగ్ అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ (ED )పల మార్లు విచారించిన సంగతి తెలిసిందే.
సిట్టింగ్ ఎమ్మెల్యే, 30 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోలేని దౌర్భాగ్యం పట్టిందని సాయన్న అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులపై చిన్నచూపు చూస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత సీఎం మాట తప్పినప్పటి నుంచే దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని రుజువైందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెడితే సాయన్న వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరిలో అసంతృప్త...
hijras on ys sharmila:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై (sharmila) హిజ్రాలు (hijra) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) గురించి కామెంట్స్ చేసే సమయంలో తమ పేరును ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని అమీర్ పేటలో (ameerpet) హిజ్రాలు ధర్నా చేపట్టారు.
Raja singh:అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు (child) చనిపోయిన ఘటనపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) స్పందించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్ (pradeep) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.