hijras on ys sharmila:షర్మిల క్షమాపణ చెప్పు.. లేదంటే పాదయాత్రను అడ్డుకుంటాం
hijras on ys sharmila:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై (sharmila) హిజ్రాలు (hijra) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) గురించి కామెంట్స్ చేసే సమయంలో తమ పేరును ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని అమీర్ పేటలో (ameerpet) హిజ్రాలు ధర్నా చేపట్టారు.
hijras on ys sharmila:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై (sharmila) హిజ్రాలు (hijra) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) గురించి కామెంట్స్ చేసే సమయంలో తమ పేరును ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని అమీర్ పేటలో (ameerpet) హిజ్రాలు ధర్నా చేపట్టారు. లేదంటే షర్మిల (sharmila) చేపట్టే అన్ని కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. పాదయాత్ర కూడా జరగనివ్వమని హెర్చించారు. తెలంగాణ ట్రాన్స్ జెండర్ కమిటీ హైదరాబాద్ విభాగం తరఫున వారు నిరసన చేపట్టారు.
షర్మిల (sharmila) ప్రజా ప్రస్థాన పాదయాత్రలో ఎమ్మెల్యే శంకర్ నాయక్.. షర్మిలను (sharmila) కొజ్జాలా (kojja) ఉంటావని అన్నారు. దీంతో షర్మిల (sharmila) మీరే కొజ్జా అని కౌంటర్ ఇచ్చారు. దానిని హిజ్రాలు తప్పు పట్టారు. తమ గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారని అడిగారు. తమ మనోభావాలను దెబ్బతీయడం తగునా అని అడిగారు.
తను శంకర్ నాయక్‌ను దూషించలేదు.. ఆయనే తనను వలసదారు అన్నాడు, కొజ్జా లాగ ఉంటారు అన్నాడని గుర్తుచేశారు. తనను కొజ్జా అని అంటేనే అనాల్సి వచ్చిందన్నారు. మహిళ మంత్రి శిఖండి అని అంటే… ఏమి అనలేదు. మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) మరదలు అంటే.. ఏవడ్రా మరదలు అన్నాను. కానీ వ్యక్తి గత దూషణలు చేయలేదని షర్మిల అన్నారు. ఎమ్మెల్యేను కొట్టమని చెప్పలేదు, ఎమ్మెల్యే వాహనాలు ధ్వంసం చేయమని చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యలకు రెచ్చి పోయి ఎమ్మెల్యే మీద దాడులు జరగలేదన్నారు. ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణల మీద మాత్రమే మాట్లాడామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ (hyderabad) నగరంలో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల గురించి షర్మిల కంప్లైంట్ ఇవ్వగా.. ఆమె క్షమాపణ చెప్పాలని హిజ్రాలు డిమాండ్ చేశారు.