NGKL: అచ్చంపేట పట్టణంలో రెండవ రోజు శనివారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు.
NRML: మహిళా దినోత్సవం సందర్భంగా బాసర జోన్‌కు చెందిన ఉత్తమ ఫారెస్ట్ అధికారిణిగా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన సుంకరి అలేఖ్య (FSO, నర్సాపూర్) ఎంపికయ్యారు. హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో నేడు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక వర్గేస్ IFS చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించినట్లు తెలిపారు.
SDPT: కొమురవెల్లిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్ సర్పంచ్ గొల్ల పద్మ ఆద్వర్యంలో నిర్వహించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చెత్తా చెదారం,పిచ్చి మొక్కల తొలగించారు. రోడ్డుకు అడ్డగా ఉన్న చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, సిబ్బంది, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
NLG: నకిరేకల్ మండలం నెల్లిబండలో శ్రీ లింగమంతుల స్వామి ఆలయాన్ని ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. త్వరలో జరగనున్న జాతరకు చేపట్టాల్సిన ఏర్పాట్లను గురించి అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
HNK: శాయంపేట మండలం హుస్సేన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుండెకారి రజిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు అరవింద్-తేజశ్రీ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు.
BHPL: ప్రజలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బౌతు శోభ రాజేష్ అన్నారు. శనివారం వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం సరిగ్గా అందుతుందా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలచే విద్యాభ్యాసం చేయించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామంలో ఏరువాక సాగుబడి కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా AO రజిత HIT TVతో మాట్లాడారు. రైతులు ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే భూములను సిద్ధం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
SRPT: నడిగూడెం మండలం నారాయణపురం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం నర్సిరెడ్డి ఇవాళ మృతిచెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నారాయణపురం గ్రామాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పలువురు నేతలు కొనియాడారు.
MDCL: బోడుప్పల్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) పరిశోధన కేంద్రాన్ని ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల B.Sc వృక్షశాస్త్ర విద్యార్థులు సందర్శించారు. శాస్త్రవేత్తలు నిమ్మగడ్డి, జేరనీయం, అశ్వగంధ, తులసి వంటి ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, డిస్టిలేషన్ విధానం వివరించారు. డైరెక్టర్ జి.వి.కిరణ్ బాబు పాల్గొన్నారు.
MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99వ ‘ప్రజా పాలన-ప్రజా ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సందడి నెలకొంది. పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ‘ప్రజల వద్దకే పాలన’ అనే నినాదంతో మున్సిపల్ యంత్రాంగం శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.
GDWL: అయిజ మండలం బింగి దొడ్డి పెద్ద చెరువు కట్ట కింద ఉన్న తిమ్మప్ప స్వామికి శనివారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు కోనేరు జలాలతో స్వయంభూ విగ్రహానికి అభిషేకం చేసి అర్చన, ఆకు పూజ, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని సేవకులు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలో చేపట్టిన ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేయాలని కూలీలకు సూచించడం జరిగిందన్నారు. అలాగే ఎండదెబ్బ తగలకుండా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు.
JGL: గొల్లపల్లి మండలంలోని రంగదామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ‘ప్రజా పాలన-పల్లె ప్రగతి’ పనులను సర్పంచ్ అఖిల ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు నీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.
NLG: వలిగొండ (బీబీనగర్ క్యాంపస్)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను ప్రిన్సిపల్ ఎస్. రూప ప్రారంభించారు. విద్యార్థినులకు పారిశుద్ధ్య డ్రైవ్‌పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
MNCL: చట్టాలపై వార్డు సభ్యులు అవగాహన కలిగి ఉండాలని లక్షెట్టిపేట జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాలలోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, వార్డు సభ్యుల విధులపై అవగాహన కల్పించారు.