• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

JGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కం రాజశేఖర్ (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న లక్కం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

February 21, 2026 / 05:48 PM IST

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: సట్టు తిరుమలేశ్‌

BHNG: రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట‌ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాడనే కక్ష‌తోనే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని అన్నారు.

February 21, 2026 / 05:48 PM IST

ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ రీజియన్ సెంటర్ ఆధ్వర్యంలో జావా, వెబ్ డెవలప్మెంట్, సీ, HTML, CSS, జావా స్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, మొదలైన కోర్సుల్లో ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9059506807లో సంప్రదించాలి.

February 21, 2026 / 05:47 PM IST

మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

JNG: బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. అధ్యక్షులుగా జుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు, సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లు, సలహాదారులుగా చింతపండు ఆంజయ్య, మట్టి బిక్షపతి, క్రిష్ణలు ఎన్నికయ్యారు.

February 21, 2026 / 05:44 PM IST

బీఆర్ఎస్‌కు భారీ షాక్..!

MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

February 21, 2026 / 05:44 PM IST

వటపత్రశాయి అలంకారంలో నృసింహుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలు, వీకెండ్ కావడంతో యాదగిరిగుట్టకు భారీగా భక్తులు తరలివచ్చారు.

February 21, 2026 / 05:43 PM IST

‘పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలి’

KMR: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 05:41 PM IST

ఉద్యమకారుల పాత్ర కీలకం: గణేష్

HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ అన్నారు. శాయంపేటలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, ఇతర హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ ఉన్నారు.

February 21, 2026 / 05:39 PM IST

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల గ్రామ పంచాయతీకి మత్స్య శాఖ కింద లైవ్ ఫిష్ వెహికల్ మంజూరు అయింది. శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించి సంఘం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

February 21, 2026 / 05:38 PM IST

18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే కఠిన చర్యలు: డీసీపీవో

ADB: తల్లిదండ్రులు ఆడపిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర అన్నారు. ‘ష్యూర్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథం’ శనివారం జిల్లా కార్యాలయానికి చేరుకుంది. చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలన్నారు.

February 21, 2026 / 05:35 PM IST

‘యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడాలి’

KNR: యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. యూరియాను అధికంగా వాడితే అధిక దిగుబడి వస్తుందనే అపొహ తీసేయాలని అన్నారు.

February 21, 2026 / 05:31 PM IST

పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో

MBNR: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫిర్యాదు ఇవ్వాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం తక్షణమే సొంత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

February 21, 2026 / 05:30 PM IST

కలెక్టర్‌తో ఎంపీ రఘురాంరెడ్డి భేటీ

KMM: ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కలిశారు. ఆయనకు అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ఎంపీ నిధుల పనుల పురోగతిపై ఆరా తీశారు. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఈజీఎస్ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని సూచించారు.

February 21, 2026 / 05:30 PM IST

ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థిని అనుష్క

MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 05:30 PM IST

‘ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేయాలి’

MDK: రేగోడ్ కేజీబీవీలో విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులుగా ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థకు గురైతే ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదంటూ రిపోర్టులో పేర్కొనడాన్ని తప్పుపట్టారు.

February 21, 2026 / 05:30 PM IST