KMR: నాగిరెడ్డిపేటలోని జప్తి జానకంపల్లి, వదలపర్తి, పోచారం గ్రామాల్లో నేడు ఉపాధి హామీ కూలీలకు చుక్కెదురైంది. ఉదయాన్నే పని ప్రదేశానికి చేరుకున్న కూలీలకు హాజరు వేసే మొబైల్ యాప్ పనిచేయలేదు. ఫోటో క్యాప్చరింగ్ విధానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎంత ప్రయత్నించినా హాజరు నమోదు కాలేదు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన హాజరు పడకపోవడంతో నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లారు.
NLG: నెర్మటకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. వెంకన్న చేరికతో నెర్మటలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని వెంకన్న తెలిపారు.
JN: చిల్పూర్ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 8 రోజులుగా భక్తుల రద్దీ మధ్య వైభవంగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా హోమాలు, బలిహరణం,మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజావరోహణం వంటి విశేష సేవలు జరిగాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
SRCL: తెలుగు రాజకీయాల్లో దుద్దిల్ల శ్రీపాదరావుది ప్రత్యేకమైన చరిత్ర అని, ప్రభుత్వ విప్ విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 89 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ విప్ పాల్గొన్నారు.
BDK: టేకులపల్లి మండలం హరిజనవాడలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పర్యటించారు. పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. విడతల వారీగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.
NRML: రేపు జరగనున్న హోలీ పండగ నేపథ్యంలో నిర్మల్ పట్టణంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.రంగులు, పిచికారీలు,మిఠాయిల కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు.ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలతో దుకాణాలు సిద్ధమయ్యాయి.పండగ సమీపిస్తున్న వేళ పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.
JN: బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వరుస దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ADB: నార్నూర్ మండలంలో రోజురోజుకు ఎండా తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ మేరకు కుండాయి, ఎంపల్లి వాగులు ఎండిపోతున్నాయి. అయితే, రోజుకో 50 మంది పర్యాటకులు వచ్చే ప్రదర్శనలు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎండా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న కారణంతో ప్రజలు సైతం ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తమయ్యారు. అత్యవసరాలకు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను సోమవారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరైన పద్ధతి కాదన్నారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
MBNR: మన్యంకొండలో అలివేలు మంగతాయారు ఫాల్గుణ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. సోమవారం ధ్వజారోహణంతో పాటు రాత్రి ఎదుర్కోళ్ల ఉత్సవం, హనుమత్ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాలను దర్శించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
JGT: జిల్లాకు చెందిన సింగం భాస్కర్ International Tamil Cultural University నుంచి గౌరవ డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ Honorary Doctor of Education పట్టాను అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకోవడం పట్ల జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల అధినేతలు కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్ఞాన వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, అంధ విశ్వాసాలను తొలగించి జ్ఞాన మార్గంలో ముందుకు సాగేందుకు ప్రేరేపించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ముఖ్య అతిథిగా ఉస్మానియా ఆచార్యురాలు డా.వై.కళ్యాణలక్ష్మి పాల్గొని మహిళలు ముందుండాలని, సాధికారత కోసం కృషి చేయాలని సూచించారు.
WGL: గీసుకొం(M)కొమ్మాల జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం నర్సంపేట మీదుగా వెళ్లే ప్రతి బస్సును కొమ్మాల వద్ద నిలపనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. జాతర రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VKB: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిర్వహించారు. సిద్ధులూరు, జైద్పల్లి, కేరెల్లి గ్రామాల్లో రైతులను కలిసి కేంద్రం అనుసరిస్తున్న తీరుపై SKM రాష్ట్ర కన్వీనర్లు టీ.సాగర్, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.
MDCL: సికింద్రాబాద్, సిద్దిపేట DEMU ట్రైన్ 77655 మేడ్చల్ స్టేషన్ వద్ద గంటకు పైగా నిలిచిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం రోజువారీగా జరుగుతుండటంతో చాలా ఇబ్బంది ఏర్పడుతుందని, పైగా రైల్లో పరిశుభ్రత కూడా దారుణంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రిపీట్ కాకుండా చూడాలన్నారు.