WNP: ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 304 మందికి గాను 296 మంది పరీక్షలకు హాజరయ్యారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 1వ తేదీ ఆదివారం సాయంత్రం కామదహహనం, ఉంటుందన్నారు.
KNR: చొప్పదండి మండల పెద్ద కురుమపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని జంగముని కుంట పక్కన ఎస్సారెస్పీ కెనాల్లో బుధవార గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. వయసు సుమారు 40-50 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు ఉంటుందని, డెడ్ బాడీ గుర్తు తెలియని విధంగా ఉందన్నారు.
WGL: నగరంలోని ESI ను నిన్న సాయంత్రం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, ల్యాబ్ సేవలు, మందుల నిల్వలు, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ… ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
JN: రఘునాథపల్లి మండలంలోని శివాజీనగర్ శివారులో గురువారం ఉదయం అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ పులి రాజు అలియాస్ రంజిత్ (25), యజమాని బంధువు చిరంజీవి (41)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.
GDWL: గద్వాల మండలం పుటాన్ పల్లి స్టేజీ దగ్గర ప్రధాన రహదారి ప్రమాద భరితంగా తయారైంది. నిత్యం వేలాది వాహనాలు ఎర్రవల్లి నుంచి గద్వాలకు రాకపోకలను సాగించే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇలా ఉంటే రాత్రివేళ ప్రయాణించే వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురికావా..? అని ప్రశ్నిస్తున్నారు.
BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొంటారని అన్నారు. మధ్యాహ్నం చంద్రుగొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తారని అన్నారు.
MLG: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం జరిగిన బీరు బాటిల్ దాడి కేసులో, నిందితులైన నితిన్, రాకేష్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అనంతరం పరకాల సబ్ జైల్‌కు తరలించి కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ADB: బ్యాంకింగ్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని DCCB బ్యాంక్ సమావేశ మందిరంలో బ్యాంక్ మేనేజర్లు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరు నాటికి నిర్దేశించుకున్న అన్ని బ్యాంకింగ్ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
NRPT: జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, 27 సబ్ సెంటర్లు, 59 పల్లె దవాఖానాల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా చికిత్సలు అందించాలని అన్నారు.
NZB: కమ్మర్‌పల్లి మండలం ఉప్పులూరులో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో రెండు నెలల పసికందును ప్రాణం తీసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆ పాపకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
HYD: నగరంలో అనేక చోట్ల దోమల బెడద ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తుంది. గల్లీలలో పొగబెట్టినా.. దోమల బెడద తగ్గట్లే, నిద్ర పోనిస్తలే. ఈ నరకంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంత ప్రజలు వాపోతూ ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడదకు కారణమేంటో కనుగొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
NRML: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గంజాయి, నాటు సారా, ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించి, కేసులు నమోదు చేయాలన్నారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
HNK: హసన్ పర్తి మండలం సిద్దాపూర్‌కు చెందిన బాల్నే మొగిలిని హత్య కేసులో నిందితురాలైన ఆమె మరదలు వంగ ఇందిరను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ చేరాలు తెలిపారు. డబ్బుల విషయంలోని గొడవ కారణంగా నిందితురాలు బండరాయితో కొట్టి, కత్తితో పొడిచి అతన్ని హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వంగ ఇందిరను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
KMM: మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ 13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో FIRలు నమోదు చేసినట్లు తెలిపారు