• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కోర్టు ప్రాంగణంలో హోలీ వేడుకలు

SRCL: వేములవాడ కోర్టు ప్రాంగణంలో బుధవారంహోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సీనియర్ సివిల్ జడ్జి అనిల్ జదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

March 4, 2026 / 09:47 AM IST

అస్తవ్యస్తంగా పార్కింగ్‌తో ఇబ్బందులు..!

పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జండా చౌరస్తా నుంచి మజీద్ వెళ్లే దారిలో దుకాణాల ముందు ఆటోలు, కార్లను ఇష్టానుసారంగా నిలుపుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

March 4, 2026 / 09:45 AM IST

హుస్నాబాద్‌లో వైభవంగా హోలీ వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ వైభవంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ మున్సిపల్ పాలకవర్గం హుస్నాబాద్ పట్టణ ప్రజలకు పాల్గొని వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఈ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకుని డీజే పాటలతో ఆడి పాడారు.

March 4, 2026 / 09:43 AM IST

పాఠశాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీకి వినతి

JGL: ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్ నిజామాబాద్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి చిన్నమలైని హైదరాబాదులోని వారి నివాసంలో మల్లాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మండలంలోని పలువురి సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ఆయనకు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు.

March 4, 2026 / 09:42 AM IST

భూ తగాదా.. ఒకరిపై ఒకరు దాడులు

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ తగాదా విషయంలో దాయాదులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సర్వే నంబర్ 216లో గల భూమిలో దారి విషయంలో గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాలలో ఓ వర్గానికి చెందిన శ్రీనివాస్, దీపక్, వెంకటేశ్ తలలకు గాయాలయ్యాయి. మరో వర్గానికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. దాయాదులు ఇరువురు పరిగి PSలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

March 4, 2026 / 09:42 AM IST

అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరం

MNCL: దళారుల ద్వారా చిన్నారులను కొనుగోలు చేయరాదని మంచిర్యాల జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి రవూఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నారులను అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టప్రకారం నేరమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ద్వారా చిన్నారులను దత్తత తీసుకోవచ్చని, పిల్లలులేని దంపతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 4, 2026 / 09:42 AM IST

కారు బైక్ ఢీ.. వ్యక్తి మృతి

వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైకును ఢీకొట్టిన ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హెమంత్ (19) అనే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు NGKL జిల్లాకు చెందిన వాడిగా గుర్తింపు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 4, 2026 / 09:41 AM IST

ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

KMM: మధిర మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్‌ పనులను పరిశీలించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సంపత్ కుమార్‌ను ఆదేశించారు. ఆట స్థలంలో ఇసుక పోయించి సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

March 4, 2026 / 09:35 AM IST

భర్త మృతి.. గర్భిణి భార్యకు తీరని శోకం

ADB: పండుగ పూట ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉట్నూర్ మండలం హస్నాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో పనిచేస్తూ, నిండు గర్భిణి అయిన భార్యతో పండుగ జరుపుకునేందుకు జైనూర్ మండలం సొన్ పటేల్ గూడా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

March 4, 2026 / 09:33 AM IST

ఈనెల 7న కార్గో సామాగ్రి వేలం

RR: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు.

March 4, 2026 / 09:31 AM IST

మట్టితో హోలీ సంబరాలు.!

VKB: మర్పల్లి మండలంలోని పంచలింగాల, సిరిపురం, తుమ్మలపల్లి గ్రామాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కాగా పంచలింగాల యువకులు రసాయన రంగులకు దూరంగా ఉండి, కేవలం మట్టితో హోలీ జరుపుకోవడం విశేషం. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యానికి హాని కలగకుండా సాగిన ఈ మట్టి హోలీ అందరినీ ఆకర్షించింది.

March 4, 2026 / 09:29 AM IST

నేటి నుంచి గుంజేడు ముసలమ్మ జాతర

MHBD: కొత్తగూడ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన గుంజేడు ముసలమ్మ అమ్మవారి మహాజాతర బుధవారం నుంచి 6 తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతర కోసం దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 4, 2026 / 09:28 AM IST

చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

GDWL: షాద్‌నగర్ పరిధిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వసతి గృహ విద్యార్థి రాజు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. హోలీ సందర్భంగా స్నానానికి వెళ్లిన అతను తిరిగి రాలేదు. మృతుడు గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. కుమారుడు క్షేమంగా రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

March 4, 2026 / 09:25 AM IST

‘వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుంది’

MHBD: వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుందని కొత్తగూడ FRO వజహాత్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని రేంజ్ పరిధిలోని కార్లాయి, బత్తులపల్లి సెక్షన్ అధికారుల ఆధ్వర్యంలో పోలరం కస్తూర్బా పాఠశాలలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించారు.

March 4, 2026 / 09:23 AM IST

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ప్రయాణికుడు..!

JN: జగద్గిరిగుట్ట నుంచి జనగామ డిపోకు చెందిన RTC బస్సులో ప్రయాణించిన ఓ కుటుంబం స్టేషన్ ఘనపూర్‌లో దిగుతూ పర్స్ మరిచిపోయింది. అందులో మొబైల్ ఫోన్, తులం బంగారం, రూ.400 నగదు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్యాసింజర్ అనంత రెడ్డి గుర్తించి ఆ పర్స్‌ను కండక్టర్ కుమార్, డ్రైవర్ రాములుకు అప్పగించారు. వారు యథావిధిగా బాధితులకు ఇచ్చారు.

March 4, 2026 / 09:21 AM IST