• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శనగ పంటను పరిశీలించిన MAO

KMR: జుక్కల్మండలంలోని మైబాపూర్ గ్రామంలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి శనివారం జాతీయ ఆహార భద్రత, పోషణ మిషిన్‌లో భాగంగా రైతులతో కలిసి శనగ పంటలను క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామంలోని రైతులు పండిస్తున్న శనగ పంటను క్షుణ్ణంగా పరిశీలించారు. పంటల పరిస్థితులపై, దిగుబడి విషయాలను రైతులతో ఆమె మాట్లాడి తెలుసుకున్నారు.

March 7, 2026 / 05:02 PM IST

‘మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కు ఉద్యోగ భద్రత కరువు’

MBNR: మెడికల్ రిప్రజెంటేటివ్స్ సామాజిక శోధకులని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా శివం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆరవ రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైందని తెలిపారు.

March 7, 2026 / 05:01 PM IST

కాళేశ్వరం నీటితో చెరువు నింపాలని రైతుల ధర్నా

SDPT: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరి గ్రామంలో శనివారం రైతులు కాళేశ్వరం నీటితో గ్రామ చెరువును నింపాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు రోడ్డుపై బైటాయించి తమ పంటలు ఎండిపోతున్నాయని, తమపై దయ చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులోకి నీటి విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ధర్నాను ఉధృతం చేస్తూ, తరువాత కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్నట్టు తెలిపారు.

March 7, 2026 / 05:01 PM IST

నీతి ఆయోగ్ సెమినార్‌కు ‘గట్టు’ ఎంపిక!

GDWL: జిల్లాలోని గట్టు మండలం బ్లాక్, నీతి ఆయోగ్ నిర్వహించే ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ ప్రాంతీయ సెమినార్‌కు ఎంపికైంది. ఈ నెల 9న విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో, విద్యలో గట్టు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను 6 రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ప్రదర్శించనున్నారు. ఈ గుర్తింపు జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.

March 7, 2026 / 05:01 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొంది రజిని, వైస్ ఛైర్‌పర్సన్ కొక్కొండ సమత, మహిళా కౌన్సిలర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సత్కరించారు.

March 7, 2026 / 05:01 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

BHPL: మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అంతకుముందు మొట్లపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 99 రోజులపాటు జరిగే ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.

March 7, 2026 / 04:56 PM IST

రేపటి నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు

NLG: మిర్యాలగూడలో 9 నుంచి 15వ తేదీ వరకు జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటక పోటీలు జరగనున్నాయి. సాంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో ‘వేదిక కళాభారతి’ ఆడిటోరియంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో నాటకాలతో పాటు నృత్య ప్రదర్శనలు ఉంటాయని అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.

March 7, 2026 / 04:55 PM IST

‘యూరియాపై రైతుల్లో ఆందోళన వద్దు’

BHNG: యూరియాపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కావలసినంత స్టాక్ సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని పీఏసీఎస్లో విలేకర్లతో మాట్లాడారు. గత ఏడాదిలో ఈ సీజన్ కు 23000 బస్తాలు సరఫరా అయ్యాయని, ఈ సీజన్‌లో ఇప్పటికే మండలానికి 48,000 బస్తాలను సరఫరా చేశామని తెలిపారు.

March 7, 2026 / 04:53 PM IST

వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

ASF: బెజ్జూర్ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు గత 2 నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలోని 22 గ్రామపంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని టెక్నికల్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారి వరకు జనవరి, ఫిబ్రవరిలో వేతనం రాలేదన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.

March 7, 2026 / 04:47 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి ఛైర్మన్‌కు వినతి

WNP: అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్‌ను వనపర్తి పట్టణ పుర ఛైర్మన్ మాధవి రమేష్‌కు కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డు వెడల్పు పనులు వేగవంతం చేయాలని, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మెయిన్ రోడ్ ఆక్రమణలను తొలగించాలన్నారు. టౌన్ హాల్, సమీకృత మార్కెట్ భవనాలను త్వరగా అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 04:45 PM IST

యూనిఫామ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ వేంనూర్ ఉత్తరతండా అంగన్వాడీ సెంటర్‌ను ఎమ్మెల్యే మురళి నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు స్కూల్ యూనిఫాం దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

March 7, 2026 / 04:43 PM IST

సేవాలాల్ మహారాజ్ జయంతికి కలెక్టర్‌కు ఆహ్వానం

BDK: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదురుగా ఆదివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోయే సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాలను పలువురు ప్రముఖులకు ఇవాళ అందజేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ అంకిత్, DMHO తుకారాం రాథోడ్, DCHS రవిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 7, 2026 / 04:43 PM IST

వెంకటసాయి నగర్ కాలనీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కమిటీ

MDCL: రామంతపూర్ పరిధి వెంకటసాయి నగర్ కాలనీలో బీరప్ప దేవాలయంలో కాలనీ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. కాలనీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. నామినేషన్ల దాఖలు 15 మార్చి 2026, ఉపసంహరణ 18 మార్చి, పోలింగ్ 22 మార్చి నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు రూ.25,000 డిపాజిట్ నిర్ణయించారు.

March 7, 2026 / 04:41 PM IST

23న ఎస్సీ కార్పొరేషన్ ఎదుట ధర్నా

NLG: దళితుల సంక్షేమం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23న NLG జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు కెవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రకటించారు. పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా దళితుల అభివృద్ధి శూన్యమని ప్రభుత్వాన్ని విమర్శించారు.

March 7, 2026 / 04:37 PM IST

సాగునీరు విడుదల.. రైతులకు ఊరట

SRCL: వేములవాడలోని గుడి చెరువు ‘తూము’ ద్వారా సాగునీటిని శనివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విడుదల చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. దీనివల్ల ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్ పాల్గొన్నారు.

March 7, 2026 / 04:37 PM IST