• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విశ్వకర్మలతోనే దేశ ఆర్థిక అభివృద్ధి

MDK: విశ్వకర్మలతో దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతరించిపోతున్న కళావృత్తులు, కళలను, చేతివృత్తులను ప్రోత్సహించి విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి చేదోడు అందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

February 27, 2026 / 05:55 PM IST

మున్సిపల్ ఛైర్ పర్సన్‌ను సత్కరించిన ఉపాధ్యాయులు

NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్‌ను స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుశీల పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పందిరి గీతకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:55 PM IST

అలుమ్ని మీట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్లో శుక్రవారం అలుమ్ని మీట్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో కార్పొరేట్ విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించారని అన్నారు.

February 27, 2026 / 05:51 PM IST

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

ASF: వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల కృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గురునులే నారాయణ నూతన గృహాన్ని ఆవిష్కరించారు. పేద ప్రజల సాకారాన్ని నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఉచితంగా ఇంటి నిర్మాణం చేస్తుందన్నారు.

February 27, 2026 / 05:51 PM IST

కన్నీరు పెట్టిస్తున్న కంది పంట

VKB: బషీరాబాద్ మండలం పలు గ్రామాలలోని రైతులు ఆశతో సాగు చేసిన కంది పంట చేతికొచ్చే సమయంలో పాడైపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టిన పంట కళ్లముందే నాశనమవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పాడైపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

February 27, 2026 / 05:50 PM IST

బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించిన ఎంపీ

JN: జనగామలో బాల్య వివాహ విముక్తి రథాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తు అంధకారమవటం, విద్య, ఆరోగ్యంపై గొడ్డలి పెట్టులా మారుతున్నాయని, బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సమాజం ముందుకు నడవాలని, బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ అన్నారు.

February 27, 2026 / 05:50 PM IST

‘నిర్లక్ష్యం వీడండి.. ప్రాణాలు కాపాడుకోండి’

VKB: రోడ్డు ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు కీలక సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, ఫోన్ వినియోగమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కంటి చూపు లోపం ఉన్నవారు రాత్రి వేళల్లో వాహనాలు నడపడం ముప్పుతో కూడుకున్నదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

February 27, 2026 / 05:46 PM IST

అర్బన్ బయోడైవర్సిటీ అభివృద్ధి అంశాలపై వినతిపత్రం

MDCL: అల్వాల్ సర్కిల్, తుర్కపల్లి డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్, 190, 191 రాజ్ జేతేందర్ నాథ్ శుక్రవారం ఐఏఎస్ అధికారులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌లను కలిసి డివిజన్‌లలో వివిధ సమస్యలు, అర్బన్ బయోడైవర్సిటీ అభివృద్ధి అంశాలపై వినతిపత్రం అందజేశారు.

February 27, 2026 / 05:46 PM IST

నిగా నీడలో పీరంపల్లి

VKB: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకుగాను ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ గురువారెడ్డి అన్నారు. గ్రామంలో మూడు లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని గ్రామసభలో వివరించారు.

February 27, 2026 / 05:46 PM IST

మంత్రి సీతక్కను కలిసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ

MLG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ నేడు మంత్రి సీతక్కను కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేసి, శాఖకు మరింత మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని, త్వరలో HODలతో సమావేశమై బడ్జెట్ కసరత్తు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీనీ మంత్రి సీతక్క ఆదేశించారు.

February 27, 2026 / 05:45 PM IST

30 నిమిషాల్లోనే తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

RR: ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో తప్పిపోయిన చిన్నారిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. అంజలి, రాజు దంపతులు ఓ హాస్టల్లో ఉంటున్న బంధువులను చూడడానికి రాగా.. కుమార్తె ఆడుకుంటూ తప్పిపోయింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా చిన్నారిని అరగంటలోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సదరు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు

February 27, 2026 / 05:45 PM IST

వార్డ్ నెంబర్ల ధ్రువీకరణ పత్రాలు అందించిన ఎంపీడీవో

WGL: నెక్కొండ ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న వార్డ్ సభ్యులకు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు ఎంపీడీవో లావణ్య, గ్రామాల అభివృద్ధిలో వార్డ్ సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరే విధంగా పనిచేయాలని వార్డ్ నెంబర్లకు సూచించారు.

February 27, 2026 / 05:43 PM IST

పెద్దపల్లి మార్కెట్లో నేటి పత్తి ధరలు ఇవే

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఇవాళ పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగిందని అధికారులు తెలిపారు. పత్తి కనిష్ట ధర క్వింటాకు రూ. 5,511 కాగా, గరిష్ట ధర రూ. 7,469గా నమోదయింది. మొత్తం 258 మంది రైతులు 871 బస్తాల్లో 931.97 క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చారు.

February 27, 2026 / 05:42 PM IST

‘విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి’

NRML: పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. లక్ష్మణచందా మండలం వడ్యాల్ జడ్పీ హైస్కూల్‌ను ఇవాళ ఆమె ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గణితం, ఇంగ్లీషు వంటి విషయాలపై ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరిశీలించారు. పరీక్షల్లో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.

February 27, 2026 / 05:42 PM IST

ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన

SRD: సిర్గాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం సాగుపై శుక్రవారం MAO హరికృష్ణ రైతులకు అవగాహన కల్పించారు. హెర్బీ సైడ్ టాలరెంట్ HT భక్తి సాగు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు భూసార పరీక్ష కార్డు సిఫారసు ఆధారంగా రసాయన ఎరువుల వాడకంపై సూచనలు ఇచ్చారు. బియ్యం కిసాన్ లబ్ధిదారులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో AEO భాస్కర్, రైతులు ఉన్నారు.

February 27, 2026 / 05:42 PM IST