VKB: మర్పల్లి మండలంలోని మజీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్పికర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ముస్లింలకు ఖర్జూర తినిపించి ఉపవాస దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ఉదవాసాలు ప్రజలందరికి మంచి జరిగేలా ఉండాలని కోరుకున్నారు.
HYD: జలమండలి బస్తిబాట కార్యక్రమంలోభాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తావద్ద సీవరేజ్ మరమ్మతు పనులను MD అశోక్ రెడ్డి పరిశీలించారు. నానల్ నగర్-మెహదీపట్నం వైపుగాఉన్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు. ఫుట్ పాత్ ఆనుకొని ఉన్న మ్యాన్ హోళ్లలోకి చెట్లవేర్లు చేరి సమస్య పెంచిందని గుర్తించారు. చెట్లవేర్లను తొలగించి ధ్వంసమైన మ్యాన్ హోళ్లను పునర్నిర్మానం చేయలన్నారు.
MDCL: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూ BNS- 189 సెక్షన్ (IPC- 144) అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్రాల పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా వహిస్తున్నట్లు వెల్లడించారు.
KMM: టేకులపల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సక్కుబాయి అనే మహిళ మృతి చెందింది. బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోగా, గాయపడిన బైక్ రైడర్, ఆటో డ్రైవర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
SRPT: కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, అంబేద్కర్ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మంగళవారం సాయంత్రం పట్టణ విద్యుత్ ఆపరేషన్ ఏఈ నరసింహనాయక్ పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
RR: మియాపూర్-2 డిపో పరిధిలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశంగౌడ్ తెలిపారు. మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు సమస్యలతో పాటు సూచనలు, సలహాలు తెలిపేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226420 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.
BHPL: జిల్లా IDOC కార్యాలయంలో POSH Act–2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా POSH చట్టం పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. సంక్షేమ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 44 అంతర్గత ఫిర్యాదు కమిటీలు (ICs), 7 ప్రైవేట్ సంస్థల్లో ICలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రైవేట్ సంస్థలు కూడా తప్పనిసరిగా IC ఏర్పాటు చేయాలన్నారు.
SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్సై రమాకాంత్ చేరుకున్నారు. సంఘటనా స్థలంలో జేసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
JGL: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన సమిండ్ల వాణి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేయగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు పాల్గొన్నారు.
MNCL: హాజీపూర్ మండలం టీకానపల్లి చెరువులో పడి ఒకరు మృతి చెందినట్లు SI కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడిని అదే గ్రామానికి చెందిన మెడపట్ల పోచయ్యగా గుర్తించారు. మేకల కాపరి అయిన పోచయ్య చెరువు గట్టుపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
KMR: రాజంపేట మండలంలో కురిసిన గాలివానకు పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని పెద్దపల్లి, బసన్నపల్లి గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను సాగు చేశారు. గాలి వాన వల్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
SRPT: పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు నిమిషం నిబంధన ఎత్తివేశారు. పరీక్ష సమయానికి 5ని.ల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉ.9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.05గంటల వరకు అధికారులు అనుమతించనున్నారు.విద్యార్థులను ఉదయం 8గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45గంటలకల్లా ఓఎంఆర్ షీట్ పై వివరాలన్నీ సరి చూసుకోవాలి. 9గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు.
WNP: ఆత్మకూరు పట్టణానికి చెందిన హిమబిందు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. అండర్-16 విభాగంలో పశ్చిమ బెంగాల్ వేదికగా ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. జాతీయ స్థాయికి ఎంపికై పట్టణానికి పేరు తెచ్చిన హిమబిందును ఎంఈవో బాలరాజుతో పాటు పలువురు పట్టణ వాసులు అభినందించారు.
SRCL: నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబానికి చెందిన పసిపాపను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ, దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నాయకులు కోరారు.
KNR: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పెగడపల్లి మండలంలో పర్యటించనున్నారు. పెగడపల్లి కేంద్రంతో పాటు ఐతుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఆయన ప్రారంభించనున్నట్లు ఏఎంసీ ఛైర్మన్ రాములుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.