SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారిని 47,280 ఈవో రమాదేవి తెలిపారు. స్వామివారికి 2906 కోడె మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు.
MDK: టేక్మాల్‌లోని రైతు వేదిక వద్ద ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. పేట డివిజన్ పరిధిలోని టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన రైతులు ఈ సదుపాయాన్ని పొందారు. అధికారులు మాట్లాడుతూ.. ఆధునిక సాగుకు యంత్రాలు ఎంతో అవసరమని, ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MHBD: జిల్లా కేంద్రంలోని పలు మండలాలలో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో బయ్యారం మండలం బీరోనిమాడువల గ్రామంలో గాలివానతో రైతుల మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తమను నష్టపరిచాయని, నష్టపోయిన పంటకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
NRML: వికారాబాద్ అనంతగిరిలో తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల శిక్షణ కేంద్రం లో రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ, నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.
RR: తంగడపల్లి మజీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.
NRKL: కల్వకుర్తి మార్కెట్‌లో వేరుశనగ గరిష్ఠ ధర క్వింటాలుకు రూ.10,399 పలికినట్లు అధికారులు తెలిపారు. ఇతర రకాల ధరలు రూ.10,009, రూ.4,360గా నమోదయ్యాయి. కందులు అన్ని రకాలు రూ.7,309 ధరకు అమ్ముడయ్యాయి. మార్కెట్‌కు మొత్తం 807.90 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది.
MHBD: తొర్రూరు మండలంలోని కొమ్మనపల్లి తండాలో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు ఆదివారం స్థానిక సర్పంచ్ భూక్యా స్వరూప నరేందర్ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని, గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.
HNK: యాదవ నగర్‌లో నాల్గోవ డివిజన్ కార్పొరేటర్ రఘుపై నేడు దాడి జరిగింది. రఘుపై దాడి చేస్తుండగా తమ్ముడు లక్ష్మణ్ అడ్డుకోవడంతో లక్ష్మణ్ చెయ్యికి గాయాలయ్యాయి.బాధితులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ లోని శివనగర్ కాలనీలో ఉన్న శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ ద్వితీయ వార్షిక మహోత్సవాలు రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య తెలిపారు. ఇవాళ ఆలయ ప్రాంగణంలో వార్షిక మహోత్సవాల కరపత్రలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో HNK జిల్లా కేంద్రంలో మార్చి 5వ తేదీన ఏటూరునాగారం ITDA ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITDA PO చిత్ర మిశ్రా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల నిరుద్యోగులు ఉదయం 10:00 లోపు గిరిజన భవన్‌కు విద్యఅర్హత పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.
SRCL: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
నారాయణపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తాలో ఆదివారం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి వాహనదారుడి బాధ్యత అని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.
SRD : అమీన్ పూర్ డివిజన్ గండిగూడెం కాలనీలో నూతన శివ పంచాయతం రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
MDK: శివంపేట మండలం గుండ్లపల్లిలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులను అభినందించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
NZB: మోపాల్ మండలం కులాస్పూర్ సర్పంచ్ గుడి జనార్దన్రెడ్డి నిజామాబాద్ రూరల్ MLA రేకులపల్లి డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగా రెడ్డి, తాడేం సర్పంచ్ జలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.