• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బసవేశ్వరుని ఆశయాలు ఆదర్శనీయం

VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక, సామాజిక మార్గం నేటి సమాజానికి ఎంతో ఆచరణీయమని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షుడు విజయకుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బసవరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. బసవేశ్వరుడు చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.

February 22, 2026 / 05:19 PM IST

మౌలిక వసతుల కల్పనకు కృషి : ఎమ్మెల్యే

SRD: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:18 PM IST

రేపు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్ రాక

KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

February 22, 2026 / 05:15 PM IST

మన్ కీ బాత్‌ను వీక్షించిన ఎంపీ

MBNR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ ఎపిసోడ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, యువత ప్రేరణ, స్వచ్ఛ భారత్‌, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 05:10 PM IST

అంబేద్కర్ ఆశయ సాధన సంఘం 366వ జ్ఞానమాల కార్యక్రమం

మేడ్చల్: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 366వ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు నివాళులర్పించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా నాగర్ కర్నూల్లో చాకలి కులస్తులపై అగ్రకుల నేతల దాడి, 2 నెలల పసికందు మృతి దురదృష్టరమని అన్నారు.

February 22, 2026 / 05:09 PM IST

వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే జాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి భక్తి భావాన్ని అలవరుచుకోవాలన్నారు.

February 22, 2026 / 05:06 PM IST

ఈ నెల 28న ‘వికసిత్ భారత్’ యూత్ పార్లమెంట్

SDPT: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఈనెల 28న సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జి సునీత తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం, వారి అభిప్రాయాల సేకరణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

February 22, 2026 / 05:02 PM IST

కారును తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో

KNR: శంకరపట్నం నుంచి వీణవంక వైపు వస్తున్న ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆముదాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన ఆటో, రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ చింతల సంపత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.

February 22, 2026 / 05:01 PM IST

స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకింపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్‌లో 7వ తరగతి విద్యార్థి శ్రీనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం హాస్టల్ గదిలో విద్యార్థి ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అతన్ని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 04:58 PM IST

జీవన జ్యోతిర్లింగ ధ్వజస్తంభం ప్రతిష్టాపన

SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జీవన జ్యోతిర్లింగ శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. ఆలయం ముందు ద్వాజస్తంభం ప్రతిష్ట కూడా శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.

February 22, 2026 / 04:57 PM IST

‘భూమిని కౌలు తీసుకొని మొక్కజొన్న పంట సాగు’

MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన రైతు 3 ఎకరాల భూమిని కౌలు తీసుకోని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. పంట సాగులో వచ్చే దిగుబడి కూలీలకు, ఎరువుల ఖర్చులకు సరిపోతుందని రైతు HIT TV కి తెలిపారు. కోతులు పంటను నాశనం చేస్తున్నాయని, ఈ పంటకు సరైన నీటి సౌకర్యం లేదని వాపోయారు. పంట మంచిగా పండితే ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుందని తెలిపారు.

February 22, 2026 / 04:46 PM IST

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష.. 15 మంది గైర్హాజరు

వనపర్తి నాగవరం తండాలోని గురుకుల కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన ప్రవేశ పరీక్షలు ముగిశాయి. మొత్తం 669 మంది విద్యార్థులకు గాను 654 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరైనట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ అర్చన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

February 22, 2026 / 04:46 PM IST

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

RR: నందిగామ(మం) మామిడిపల్లిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు. స్వామి కరుణ ఎల్లప్పుడూ తమపై ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:45 PM IST

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 22, 2026 / 04:41 PM IST

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: వార్డు కౌన్సిలర్

KMM: మధిర మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్,వైస్ ఛైర్పర్సన్,కౌన్సిలర్ల సన్మాన సభ ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 21 వ వార్డు కౌన్సిలర్ రంగా రూప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కౌన్సిలర్ బాధితులు అప్పగించిన ప్రజలకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

February 22, 2026 / 04:40 PM IST