• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పుట్టుక నీది.. చావు నీది అంటూ తెలంగాణ గవర్నర్ ప్రసంగం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో మలుపులు తిరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి, స్వాత్రంత్య సమరయోధుడు కాళోజీ నారాయణ రావు చెప్పిన ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే పంక్తులను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ ప...

February 3, 2023 / 12:41 PM IST

సచివాలయంలో ‘మంటలు’.. రేవంత్, బండి ఏమన్నారంటే..

హైదరాబాద్ నడిబొడ్డున అమెరికాలోని వైట్ హౌస్ మాదిరి నిర్మాణమవుతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో మంటలు వ్యాపించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ సంఘటన చెలరేగడం దురదృష్టకరమని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. స...

February 3, 2023 / 11:39 AM IST

కే విశ్వనాథ్‌కు పవన్ నివాళి, నరేంద్ర మోడీ సంతాపం

కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు...

February 3, 2023 / 10:51 AM IST

కె.విశ్వనాథ్ మృతిపై సీఎం కేసీఆర్ భావోద్వేగం

ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు విశ్వనాథ్ అని సీఎం కొనియాడారు. భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తమ సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సీఎం కేసీఆర్...

February 3, 2023 / 10:08 AM IST

నా తండ్రి తర్వాత కేసీఆర్ స్ఫూర్తి: కుమారస్వామి

తనకు తన తండ్రి హెచ్‌డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...

February 3, 2023 / 09:29 AM IST

కే విశ్వనాథ్ మృతిపై చిరు, బాలకృష్ణ

కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిన...

February 3, 2023 / 08:55 AM IST

బ్రేకింగ్: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. సచివాలయం ప్రధాన గుమ్మంపై దట్టంగా మంటలు అలుముకున్నాయి. 11 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది. భవనం 5, 6వ అంతస్తుల్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే...

February 3, 2023 / 08:11 AM IST

పాటరాస్తూనే కన్నుమూత.. ఆస్కార్ బరిలో తొలి తెలుగు సినిమా విశ్వనాథ్‌దే

ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...

February 3, 2023 / 08:55 AM IST

కళా తపస్వి, డైరెక్టర్ విశ్వనాథ్ కన్నుమూత

తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతిక‌కాయాన్ని ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లిస్తున్నారు. క‌ళాత‌ప‌స్వీ ఇక‌లేర‌ని తెలుసుకున్నతెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ షాక్‌కు గురైంది. కాశీనాధుని విశ్వ‌నాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మ‌రుపురాని అజ‌రామ‌ర‌మైన చిత్...

February 3, 2023 / 08:55 AM IST

రేపటినుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగింస్తారు. రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రా...

February 2, 2023 / 09:44 PM IST

సోమేశ్ కుమార్‌పై వారెంట్ జారీ

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కేసు విషయంలో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద పరిగణించింది. ఈ మేరకు వారెంట్ జారీచేసింది. ఇటీవల ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జీఏడీలో రిపోర్ట్ చేశారు. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్‌ఎంసీ కమ...

February 2, 2023 / 08:54 PM IST

ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని కేఏ పాల్ పిటిషన్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సచివాలయ ప్రారంభోత్సవ తేదీ గురించి అభ్యంతరం తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన జయంతి రోజున ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం సరికాదన్నారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్...

February 2, 2023 / 06:36 PM IST

తూచ్ ysrtpలో చేరడం లేదు.. షర్మిల ప్రకటన తర్వాత పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. తొలుత బీజేపీలో చేరతారని వినిపించింది. తర్వాత వైఎస్ఆర్ టీపీ అని ప్రచారం జరిగింది. తర్వాత ఆ పార్టీ అధినేత షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరిక ఖాయం అనిపించింది. దానిని షర్మిల కూడా ధృవీకరించారు. ఇంతలోనే పొంగులేటి మాట మార్చారు. తూచ్.. అనేశారు. అవును షర్మిల పార్టీలో చేరుతున్నారనే...

February 2, 2023 / 06:05 PM IST

భూపాలపల్లిలో ఈసారి గెలిచెదెవరు?

  తెలంగాణలో త్వరలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అంశంపై డిసెంబర్ లోపే నోటిఫికేన్ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎవరెవరు పోటీ చేయనున్నారు? ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యల గురించి ఇప్పుడు...

February 2, 2023 / 04:42 PM IST

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గ...

February 2, 2023 / 02:47 PM IST