• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

NLG: చండూరు మండల ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం (రేపు) మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆపరేషన్లు అవసరమైన వారికి హైదరాబాద్‌లో ఉచితంగా చేయిస్తామని వెల్లడించారు.

February 21, 2026 / 11:10 AM IST

విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

BDK: మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌లో నిర్మితమవుతున్న దశావతార శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానకి హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 11:08 AM IST

యంనోనిపల్లిలో విద్యుత్ అభివృద్ధి

NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలో పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్ల పునర్నిర్మాణం ప్రారంభించారు. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో 25 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సహకారం, సర్పంచ్ బోయ నాగేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరహరి పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.

February 21, 2026 / 11:07 AM IST

పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం శనివారం ఔట్ ఫ్లో 156 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. కాగా 31 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.527 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1.820 టీఎంసీలు ఉందన్నారు.

February 21, 2026 / 11:04 AM IST

‘హరినామ సప్తహ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం’

ADB: ఇచ్చోడ మండలంలోని ధర్మపురి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈ నెల 25న నిర్వహించనున్న అఖండ హరినామ సప్తః కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేశారు. గ్రామస్తులు అందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:03 AM IST

ఘనంగా మల్లికార్జున స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం

KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లిఖార్జున స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 21, 2026 / 11:02 AM IST

అగ్ని ప్రమాదంలో పత్తి దగ్ధం

PDPL: అంతర్గాం మండలం గోలివాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖాజామియా అనే రైతు విక్రయానికి సిద్ధంగా ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల పత్తి మంటల్లో చిక్కుకుంది. స్థానికులు శ్రమించి మంటలను ఆర్పినప్పటికీ, అప్పటికే సగం పంట దగ్ధమై రైతుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.

February 21, 2026 / 11:02 AM IST

గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల

BDK: రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్‌లోని నిధులను విడతలవారీగా మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే శుక్రవారం మూడో విడతకుగాను రూ.387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం రూ.1,034.42 కోట్ల మేర నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.

February 21, 2026 / 11:01 AM IST

‘ఇంటర్మీడియట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి’

WGL: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని DEO శ్రీధర్ సుమన్ ఆదేశించారు. CS, DOలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారని వెల్లడించారు.

February 21, 2026 / 11:00 AM IST

నీలాయపల్లి గ్రామపంచాయతీలో ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం

MNCL: తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దొంగలు ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగలు దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్ AE కి,SI కి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ పొలవేణి తిరుపతి స్పష్టం చేశారు.

February 21, 2026 / 10:49 AM IST

బకాయి పన్నులను సకాలంలో చెల్లించాలి: గ్రామ కార్యదర్శి

WGL: నల్లబెల్లి మండలంలోని ముచింపుల గ్రామపంచాయతీలో శనివారం గ్రామ కార్యదర్శి తొగరు అనిత ఆధ్వర్యంలో ఇంటి పన్ను వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులు తమ బకాయి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే గ్రామంలో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

February 21, 2026 / 10:46 AM IST

ఆళ్లపల్లి మండలంలో పెద్దపులి కలకలం

BDK: ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్‌లోకి ప్రవేశించిన పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రైతులు, కూలీలు ఎవరూ వ్యవసాయం చేనులకు వెళ్ళొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

February 21, 2026 / 10:45 AM IST

రేపే గురుకుల ప్రవేశ పరీక్ష.. 68 కేంద్రాలు ఏర్పాటు

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు నిర్వహించనున్న అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి జోన్-4 అధికారి అలివేలు తెలిపారు. మొత్తం 68 కేంద్రాల్లో 25,140 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని, గంట ముందే గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు.

February 21, 2026 / 10:45 AM IST

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

NLG: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; అలాగే, 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తిగల వారు మార్చి 31 లోపు జిల్లా చేనేత శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

February 21, 2026 / 10:44 AM IST

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సుశాంక్ ఎంపిక

NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు.

February 21, 2026 / 10:44 AM IST