దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జీవితంపైనే విరక్తితో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రాసుకున్న లేఖలో ఆయన తెలిపాడు. అనారోగ్య సమస్యలు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్...
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్‌లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం. ‘ప్రజల మధ్య గణతంత్ర వ...
‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్‌బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వే...
పెళ్లికి సమయం ముంచుకొస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.. పనులు వేగవంతం చేయాలని వరుడు కూడా ఓ చేయి వేశాడు. కుటుంబసభ్యులతో పాటు అతడు పనులు చేస్తున్నాడు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఆ యువకుడు కొద్దిసేపటికే కుటుంబాన్ని మొత్తం కన్నీటిలో ముంచి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆనందాలు సంతోషాలతో నిండాల్సిన ఆ ఇంట్లో గుండెశోకం మిగిలింది. ఈ సంఘటన తెలంగాణలోని ఆదిలాబ...
ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. రిపబ్లిక్ డే రోజున సాయంత్రం గవర్నర్ ఎట్ హోం నిర్వహిస్తుంటారు. ఇటీవల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య దూరం మరింత పెరిగింది. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కోర్టు తీర్పు తర్వాత రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహణకు ఏర...
గణతంత్ర దినోత్సవ కార్యక్రమం కూడా తెలంగాణలో రాజకీయంగా మారింది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షంపై తీవ్రంగా స్పందించగా.. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఇదే విషయమై సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ వెంటనే వీఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధ...
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా సాగుతుండగా తెలంగాణలో మాత్రం వాడీవేడిగా జరిగాయి. మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గణతంత్ర వేడుకలు వివాదానికి కారణమయ్యాయి. రాజ్ భవన్ లో జెండా వందనం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫామ్ హౌజ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్...
గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my...
తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైద...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...
నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్ధవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం గొప్పదనం, ప్రాధాన్యం వివరిస్తూనే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేన...