సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన రూమ్ మ్యాప్ విడుదలైంది. మంగళవారం పవన్ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టుకి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాబోవు ...
దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జనవరి 26వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణ ఏకైక శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రజాకార్ల సమయంలో జోగుళాంబ అమ్మవారి మూలవిరాట్ ను బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. 2005లో వసంత పంచమి రోజున కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయంలో ...
గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకో...
క్యూబాలో ప్రజలు పేదోళ్లలాగా బతికి ధనికుల్లా చనిపోతారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. క్యూబా విప్లవయోధుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కు విచ్చేశారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు ముఖ్య అతిథులుగా వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు దేశమన్నా...
ఖమ్మం జిల్లాలోని మండాలపాడులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని, వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు యువతి కుటుంబాన్ని వెలివేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ.20 వేల జరిమానా విధించారు. ...
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ భక్తులు మల్లన్న పేరి...
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామని వెల్లడించింది. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని రూ.1800 కోట్లతో ఏర్ప...
క్యూబా విప్లవయోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగ...
రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజనకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాలేదు. సంస్థలు, నిధులు, ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు రావాల్సిన బకాయిలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన నిధులు తెలంగాణకు చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. విభజన మొదటి ఏడాది ...
కంగారూ జీవిని చూశారా.. కడుపు పొత్తిళ్లలో తన పిల్లలను వేసుకుని వెళ్తుంటుంది. తన పిల్లలను ఒడిలో దాచుకుంటుంది. అదే మాదిరి మనుషులకు కూడా సరికొత్త విధానంలో తెలంగాణ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దాని పేరే ‘కంగారూ ఫాదర్ కేర్’. ఈ విధానం ప్రజలందరి ప్రశంసలు అందుకుంటుంది. తెలంగాణ వైద్యులు కొత్తగా చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోంది. అయితే ఆ వైద్య విధానం ఏమిటీ? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? పిల్లలకు ...
తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో...
హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. ప్రిన్స్ ముకర్రమ్ జా మృతితో ఆయన స్థానంలో ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేసినట్లు నిజాం కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ లో రాజుగా అజ్మత్ పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమానికి నిజాం కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీలు హాజరయ్యార...
గుజరాత్ అల్లర్లను వ్యతిరేకించడంతోనే కేంద్ర ప్రభుత్వం తన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మల్లికా సారాభాయ్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో రామప్ప ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మల్లిక నా...
తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావి...