రవాణా సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలను సజ్జనార్ ప్రారంభించారు. ఏఎమ్ 2 పీఎమ్ అనే సరికొత్త కొరియర్ సేవలను శుక్రవారం ప్రారంభించగా.. శనివారం ఆర్టీసీ బస్సుల్లో రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలా రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలు ప్రారంభించి ప్రయాణికులకు ఆర్టీసీని చేరువ చేశారు.
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఎంచక్కా పాటలు వింటూ జాలీగా ప్రయాణం చేయవచ్చు. ప్రయోగాత్మకంగా 9 మార్గాల్లో ప్రయాణించే బస్సుల్లో రేడియో ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు వినోదంతో సురక్షిత ప్రయాణం అందించడమే ఆర్టీసీ లక్ష్యమని సజ్జనార్ ప్రకటించారు. రేడియోలో పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యం, ఆర్టీసీ అందిస్తున్న సేవలు, మానవ సంబంధాలను మరింత పటిష్టం చేసే నీతి కథలు రేడియోలో వినిపిస్తామని సజ్జనార్ తెలిపారు. వీటితోపాటు మహిళలు, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించేలా రేడియోలో ప్రసారాలు వస్తాయని వివరించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో రేడియో ప్రసారాలు అమలు చేయనున్నారు.
TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr