ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గెలవబోతున్నా. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా గురించి ప్రజలకు బాగా తెలుసు. 15 ఏళ్లు వైద్యుడిగా.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. అలాంటి నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారు.
నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు.
పెద్దా లేదు.. చిన్న లేదు.. వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు (Heart Beat) ఆగిపోతున్నది. ఇటీవల ఇలాంటి సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది.
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika) పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొంతకాలంగా సహజీవనం చేసినట్లు టాక్. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు.
హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీ ఎం కేసీఆర్( CM KCR ) తెలిపారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతనుఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah) తీసుకున్నారు. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ (BJP) నేతలు తెలిపారు.
Revanth reddy:పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే పాదయాత్రలో తనకు భద్రత పెంచాలని రేవంత్ (Revanth reddy) అంటున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేవంత్ (Revanth reddy) తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు లాయర్ (జీపీ) వాదనలు వినిపించారు.
హైదరాబాద్ లో (Hyderabad) భారీగా స్టెరాయిడ్ ఇంజక్షన్స్ పట్టుబడ్డాయి. జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చిపోతుంది. ఈ ఇంజక్షన్ (injection) ద్వారా తక్కువ సమయంలో శరీరాన్ని అనుకున్న ఆకృతిలో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ (Steroid) ఇంజెక్షన్లను పట్టుకున్నారు.
mla seethakka:కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క (seethakka) పినపాక నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించారు. గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్కే అజ్గార్ కూతురు వివాహాం, తాటి లక్ష్మయ్య కుమారుడు పెళ్లి, గామల పాటి సురేశ్ కూతురు సారీ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
ఢిల్లీలో దీక్ష కాదు... ముందు మీ అన్నయ్యను నిలదీయమ్మా అంటూ..కవితను బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగమన్న ఆయన తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమని డిమాండ్ చేశారు.
ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి పెద్ద మనుసు చాటారు. అడిగిన వెంటనే ఆటో అందించి ఓ నిరుపేద దివ్యాంగుడి కలను నెరవేర్చారు. ఎల్లారెడ్డిపేట (YALLAREDDYPET)మండలం నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్లు వంకరపోయాయి.
minister jagadish reddy:తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మధ్య వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ రోజు గవర్నర్ తమిళి సై (Tamilisai Soundararajan) స్పందించారు. సుప్రీంకోర్టు (supreme court) కన్నా రాజ్ భవన్ (raj bhavan) దగ్గర ఉంది.. డియర్ శాంతి కుమారి అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి (jagadish reddy) కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణకు(Telanaga) ప్రధాని మోదీ (Pm modi)సర్కారు మరో గిప్టు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kisahnreddy) తెలిపారు. రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతార్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానిక పరిశోధనా కేంద్రం’(కారో) (Cargo) ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. భారతదేశంలో తొలి‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నామన్నారు.
ys sharmila:బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్లు అని కొత్త పాట పాడటం వెనక ఉన్న కారణం ఏంటో అందరికీ తెలుసున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త వాదన ఎంచుకున్నారని ఫైరయ్యారు. ఇన్నాళ్లు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశం గుర్తురాలేదా అని అడిగారు.