»Out Sourcing Employee Of Minister Peshi Harassed Sportswoman
Sportswomanకు తప్పని వేధింపులు.. మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగే ఇలా
ఓ మహిళా క్రీడాకారిణి పట్ల మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. మేసెజ్ చేసి, పర్సనల్ ఫోటోలు పంపాలని కోరాడు. మహిళ తరఫు బంధువు నిలదీయడంతో కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
Out Sourcing Employee Of Minister Peshi Harassed Sportswoman
Sportswoman: ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణికి (Sportswoman) వేధింపులు తప్పలేదు. మంత్రి పేషిలో (minister peshi) పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేధించాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం కాస్త మంత్రి దృష్టికి రావడంతో ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. క్రీడాకారిణి తప్ప మంత్రి పేషి ఉద్యోగి వేధింపుల అంశం తీవ్ర కలకలం రేపుతోంది.
రాష్ట్రానికి చెందిన ఓ మహిళ (woman) తనకు ప్రోత్సాహం లభించడం లేదని భావించింది. బంధువు సాయంతో క్రీడా మంత్రిని (sports minister) కలిసి.. సాయం చేయాలని కోరింది. వివరాలను కార్యాలయంలో పనిచేస్తోన్న ఉద్యోగికి ఇచ్చి వెళ్లాలని మంత్రి (minister) సూచించారు. ఈ క్రమంలో ఆ మహిళా నంబర్ తీసుకున్న ఉద్యోగి (employee) మేసెజ్ చేసేవాడు. బూతులతో చాట్ చేయడమే కాకుండా.. పర్సనల్ పిక్స్ పంపించాలని అడిగాడని తెలిసింది.
విషయం ఆ మహిళ (woman) బంధువుకు తెలిసింది. దీంతో సదరు వ్యక్తిని కలిసి నిలదీసింది. తొలుత అదేం లేదని చెప్పి.. చివరకు క్షమించాలని కాళ్ల బేరానికి వచ్చాడు. గొడవ గురించి మంత్రి వరకు వెళ్లింది. దీంతో ఇకపై ఆఫీసుకు రావొద్దని ఆదేశించారని సమాచారం. గత 2 వారాల నుంచి ఆ ఉద్యోగి (employee) విధులకు రావడం లేదని తెలిసింది. మహిళా క్రీడాకారిణిపై అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి.
ఓ మహిళా అథ్లెట్ పట్ల ఉద్యోగి ప్రవర్తన చర్చకు దారితీసింది. ఈ అంశాన్ని అన్నివర్గాలు ఖండిస్తున్నాయి. మంత్రి, కార్యాలయ సిబ్బంది కూడా వెంటనే స్పందించారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. దీంతో మహిళా ఉద్యోగి, ఆమె తరఫు బంధువులు ఆందోళన ఆలోచనను విరమించుకున్నారు.