»Ntr Is The Person Who Gave Me The Courage To Claim To Be A Telugu Person Balayya
TDP : తెలుగువాడ్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ : బాలయ్య
తెలుగుదేశం పార్టీ (TDP) 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, పీవీ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ (TDP) 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, పీవీ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. ఆనాడు విజన్ 2020 రూపొందిస్తే ఎగతాళి చేశారని, తన రిపోర్టు ఆధారంగా టెలికం రంగంలో సంస్కరణలు వచ్చాయని, ఈ రోజు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల కష్టమే 41ఏళ్ళ తెలుగుదేశం పార్టీ అన్నారు బాలయ్య. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి.
పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు, మాత్రమే. ఎన్టీఆర్ యూనివర్సిటీ (NTR University)పేరు మార్పును ఖండించిన బాలకృష్ణ..ప్రాంతాలు వేరైనా.. తెలుగువారంతా ఒక్కటే అన్నారు. తెలుగు గడ్డలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత ఎన్టీఆర్ ది అని కొనియాడారు.రాజకీయాలంటే.. ఎన్టీఆర్ ముందు.. ఎన్టీఆర్ తర్వాత అన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేదల ఆకలి తీర్చిన అన్న.. బరోసా ఇచ్చిన అమ్మ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే మహిళలకు ధైర్యానిచ్చిన అన్న. ..ఎన్టీఆర్ కు మరణం లేదు.. నిత్యం వెలిగే దీపం ఎన్టీఆర్(NTR) .. ఎన్టీఆర్, చంద్రబాబు (Chandrababu) చేసిన అభివృద్ధినే ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్..పేదలకు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్ళ నిర్మాణం ఎన్టీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. పేరు పేరున టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాలయ్య బాబు శుభాకాంక్షలు తెలిపారు.
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ముదిరాజ్ మాట్లాడుతూ.. పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళిన నాయకుడు ఎన్టీఆర్. పేదల కోసం లక్షల ఇళ్ళు నిర్మించిన ఘనత ఎన్టీఆర్ దే. రెండు రూపాయల బియ్యం ఇవ్వటం వలనే పేదల కడుపు నిండా తిండి తిన్నారు. చంద్రబాబు వేసిన అభివృద్ధి బాటతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన విజన్ విజన్ (Vision Vision) వలనే పేదల పిల్లలు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. టీడీపీ జెండాను ప్రతి ఇంటికి తీసుకెళ్ళే బాధ్యత కార్యకర్తలదే. రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.