»Niloufer Hospital 14 Months Child Is Corona Positive
Niloufer hospital:లో చిన్నారికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లోని పిల్లల ఆస్పత్రిలో ఓ చిన్నారికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.
Niloufer hospital 14 months child is corona positive
తెలంగాణ హైదరాబాద్లోని నిలోఫర్ పిల్లల ఆస్పత్రి(Niloufer hospital)లో ఓ 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ అని తేలింది. నాలుగైదు రోజుల క్రితం చిన్నారికి జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. ఆ క్రమంలో ఆ పాపకు కరోనా టెస్టులు నిర్వహించగా..పాజిటివ్ అని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ చిన్నారికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కుటుంబం నాంపల్లి ఆగాపురం ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది.
తెలంగాణ ఆరోగ్య శాఖ గురువారం ఆరు కోవిడ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు తెలిపింది. అందులో నాలుగు కేసులు హైదరాబాద్ నుంచి ఒక్కొక్కటి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవి. గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించనప్పటికీ, గురువారం కోవిడ్ పాజిటివ్(corona positive) కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. ఇక తెలంగాణలో కోవిడ్ పాటిజివ్ రేటు 0.49 శాతంగా ఉండగా, రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మొత్తం 925 కరోనా పరీక్షలను నిర్వహించింది. అయితే వీటిలో 54 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన క్రమంలో ప్రకటించారు.