Children missing: నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి అదృశ్యం..ఎత్తుకెళ్లిన మహిళ!
హైదరాబాద్ పరిధిలో చిన్నారులకు ఏదైనా వ్యాధి వస్తే చాలు వెంటనే గుర్తుకొచ్చేది నిలోఫర్ హాస్పిటల్. అలాంటిది ఈ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం చిన్నారులకు భద్రత లేకుండా పోయింది. తాజాగా ఓ ఆరు నెలల బాబు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఓ మహిళ ఎత్తుకుంటానని తీసుకుని ఏకంగా ఎత్తుకెళ్లింది.
తెలంగాణ రాజధాని హైదారాబాద్లోని నిలోఫర్ పిల్లల ఆస్పత్రి(Niloufer hospital)లో ఘోరం జరిగింది. ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్ కనిపించకుండాపోయాడు. అయితే ఓ మహిళ ఎత్తుకుంటానని బాబును తీసుకుంది. ఆ క్రమంలో చిన్నారి తల్లి భోజనం చేయడానికి వెళ్లి వచ్చి చూసే సరికి మహిళతోపాటు తన బాబు కూడా కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన బాబు తల్లి ఆ ప్రాంతంలో అందరినీ అడిగింది. అయినా కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం వెతికింది. అయినా వారు కనిపించకపోవడంతో విషయం తన భర్తకు తెలిపి నాంపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు.
అయితే గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బాబు(children) అదృశ్యమయ్యాడని(missing) కంప్లైంట్లో వెల్లడించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో బాబు ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు మరికొన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో సౌకర్యాలపై అక్కడకు వచ్చిన రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోగులను సరిగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేక పోతుందని మండిపడ్డారు.